ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో మ్యాచ్ లు మొదలయ్యి అప్పుడే సరిగ్గా పదిరోజులు అవుతుంది. ప్రతి మ్యాచ్ లోనూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని మన ధనాదన్ లీగ్ అందిస్తుంది. కాగా ఐపీఎల్ ను కొన్ని జట్లు విజయాలతో ప్రారంభించగా.. ఇంకా కొన్ని జట్లు విజయం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాయి. వాటిలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ ఉన్నాయి. ఈ సారి కాంపిటీషన్ ఏమంత ఈజీగా లేదు. ప్లే ఆప్ కు చేరుకోవాలంటే గట్టి పోటీ తప్పేలా లేన్నట్లుంది. ఈ రోజు సాయంత్రం జరుగనున్న మ్యాచ్ పై అందరి దృష్టి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మీదనే నిలవనుంది. ఇప్పటి వరకు ఆడిన రెండూ మ్యాచ్ ల్లోనూ కనీసం పోటీ ఇవ్వకుండా ఓడిపోయారు.
Also Read : Covid 19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ మూడు రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి..

అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ మారినా తలరాత మారడం లేదు. వేలంలో సైతం పెద్ద ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో యాజమాన్యం చేసిన తప్పులే ఇప్పుడు వరుసగా ఓటములకు కారణాలు అని చెప్పాలి. ఇక ఈ రోజు జరుగనున్న మ్యాచ్ లో మొదటి విజయం కోసం మార్క్రమ్ సేన బరిలోకి దిగుతుంది. SRH లో మాయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్ మరియు మార్ర్కమ్ లు అంచనాలకు తగినట్లు రాణిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కు మొదటి విజయం దక్కుతుంది. బౌలింగ్ లోనూ భువనేశ్వర్ కుమార్ మునుపటిలా ఆరంభంలో వికెట్లు తీయాలి.. నటరాజన్ సైతం తన బౌలింగ్ లో పదును పెంచి ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచాలి.. ఇక రెండు విజయాలతో సీజన్ ను ఘనంగా ఆరంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు హ్యాట్రిక్ కొట్టేందుకు ధావన్ సేన ఊవ్విళ్లురుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఫేవరేట్ అంటే పంజాబ్ కింగ్స్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి చూద్దాం. చివరికి ఎవరు విజయం సాధిస్తారో అనేది..
Also Read : Tea Cups: బాబోయ్ పేపర్ కప్పులు..