ఇండియా పాక్ దేశాల మధ్య ఎలాంటి పోటీ జరిగినా అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక క్రికెట్ మ్యాచ్ జరిగితే దాని కథ వేరుగా ఉంటుంది. అక్టోబర్ నెలలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఒమన్, యూఏఈలో జరగనున్నాయి. మార్చి 20 నాటికి టీ 20 ర్యాంకింగ్స్ ఆధారంగా రెండు 12 టీమ్‌లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండిస్‌తో పాటుగా, ఇంగ్లాడ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాలు ఉండగా, గ్రూప్ బిలో ఇండియాతో పాటుగా పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లు ఉన్నాయి. ఇండియా-పాక్‌లు ఒకే గ్రూపులో ఉండటంతో రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు సంబందించిన తేదీ ఖరారైంది. దుబాయ్ వేదికగా అక్టోబర్ 24 వ తేదీన మ్యాచ్ జరగనున్నది. ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ అంతే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
Read: కొరటాల మూవీ కోసం ఎన్టీయార్ మేకోవర్!