IND vs BAN 1st Test Day2: విజృంభించిన భారత బౌలర్లు.. బంగ్లాదేశ్ కుదేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Bangladesh 1st Test Day2 Summary: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి కేవలం 133 పరుగులే చేసింది. ప్రస్తుతం మెహిదీ హసన్ (16) , ఇబాదత్ హుసేన్ (13) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలిరోజు ఆటను ఎక్కడి నుంచి ముగించిందో.. అక్కడి నుంచి రెండో రోజు ప్రారంభించింది. అప్పటికే క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వెనువెంటనే ఔట్ అవ్వగా.. రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40) బాగా రాణించారు. ఈ క్రమంలో అశ్విన్ అర్థశతకం కూడా పూర్తి చేసుకున్నాడు. వీళ్లిద్దరు ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 92 పరుగులు జోడించారు. దీంతో.. భారత్ 404 పరుగులకు ఆలౌటైంది.
ఆ తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటికి, బంగ్లా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. వచ్చినవాళ్లు వచ్చినట్టుగానే తమ వికెట్లు సమర్పించుకుంటూ.. పెవిలియన్ బాట పట్టారు. ఇప్పటివరకూ బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికుర్ రహీమ్ ఒక్కడే 28 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఇలాంటి క్లిష్ట సమయాల్లో మెహిదీ హసన్ తన జట్టుని కాపాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, మరి 16 పరుగులతో క్రీజులో ఉన్న అతగాడు ఈసారి కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతాడా? లేదా? అనేది చూడాలి. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ 3, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. ప్రెజెంట్ బంగ్లా జట్టు టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 271 పరుగుల వెనుకంజలో ఉంది.
Also Read
- Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
తాజావార్తలు
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
-
SPR India: వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ అంటే ఏమిటి? చమురు సంక్షోభంలో జాతీయ భద్రతా కవచంగా ఎలా ఉపయోగపడుతుంది?
-
Janhvi Kapoor : క్రేజీ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ… “తుంబాడ్” డైరెక్టర్ తో హార్రర్ మూవీ
-
Bharathiraja Passed Away : తమిళ సినీ దిగ్గజం అస్తమయం.. దర్శకుడు భారతీరాజా కన్నుమూత
-
Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?