Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer: మంచు ప్రభావంతో పాటు షై హోప్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ల అద్భుతమైన బ్యాటింగే తమ ఓటమికి ప్రధాన కారణమని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఓటమిపాలయ్యింది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వెస్టిండీస్.. 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ మాట్లాడాడు. మంచు ఎక్కువగా ఉన్నప్పుడు సురక్షితమైన స్కోరు ఎంత అనేది అంచనా వేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. బోర్డుపై 249 పరుగుల భారీ స్కోరు ఉన్నప్పటికీ, విండీస్ బ్యాటర్లు దాన్ని మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేజ్ చేశారంటే డ్యూ ఎంతగా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చన్నాడు. అయితే మంచు నెపం మాత్రమే నెట్టకుండా, ప్రత్యర్థి బ్యాటర్ల ఆధిపత్యాన్ని, వారి అద్భుత ప్రదర్శనను అతను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు.
రాంచీ వేదికగా జరిగిన ఈ రెండో టీ20 మ్యాచ్‌లో ఈ పిచ్‌పై బౌలర్లకు ఏమాత్రం పొరపాటు చేసే అవకాశం లేకుండా పోయిందని శ్రేయస్ తెలిపాడు. లైన్ అండ్ లెంగ్త్ కొద్దిగా మిస్సయినా బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లే పరిస్థితి ఉందన్నాడు. మైదానంలో కొన్ని క్యాచ్‌లు చేజారిన మాట నిజమే అయినా, అది ఆటలో భాగమేనని, ప్రత్యర్థి జట్టు ఆడిన తీరుకే క్రెడిట్ ఇవ్వాలని చెప్పాడు. ఇక భారత ప్రదర్శన విషయానికి వస్తే సంజూ శామ్సన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్‌తో పాటు మయాంక్ యాదవ్ బౌలింగ్ అద్భుతంగా సాగిందని ప్రశంసించాడు. సంజూ, అభిషేక్‌లు వరుసగా బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టుకు మంచి రన్‌రేట్ అందించారని, మైదానంలో వారు చూపిస్తున్న ప్రదర్శన జట్టుకు చాలా కీలకమని పేర్కొన్నాడు. అలాగే మయాంక్ యాదవ్ తీసిన ఆ మూడు కీలక వికెట్లు తమను మ్యాచ్‌లో గట్టి స్థితిలోనే నిలబెట్టాయని, కానీ ఆ తర్వాత హోప్, రూథర్‌ఫోర్డ్ల భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందని శ్రేయస్ వివరించాడు.
Also Read
- Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
- Basit Ali: 'తిలక్ వర్మనే అసలైన హీరో'.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
- Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
- Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజూ శామ్సన్ కేవలం 41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నుముకగా నిలిచాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 43 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 17 బంతుల్లో 40 పరుగులు, చివర్లో తిలక్ వర్మ 13 బంతుల్లోనే 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మెరుపులు మెరిపించారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 250 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. షై హోప్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయ శతకంతో చెలరేగగా, రూథర్‌ఫోర్డ్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ చేతుల్లోంచి లాగేసుకున్నారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్ 1-1తో సమం చేసింది.
తాజావార్తలు
-
Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
-
Basit Ali: ‘తిలక్ వర్మనే అసలైన హీరో’.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
-
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
-
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!