CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi CJP Protest: నేడు రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనలకు పిలపునిచ్చింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ సరిహద్దుల వద్ద కఠినమైన తనిఖీలు, నగరం లోపల రోడ్లపై భారీ బారికేడ్లు, మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత, అలాగే పలు మెట్రో స్టేషన్ల మూసివేశారు. శనివారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు గుమిగూడకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి నాటికే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతమంతా దాదాపు ఒక అభేద్యమైన కోటలా మారిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సుమారు 20 వేల మంది వరకు నిరసనకారులు జంతర్ మంతర్‌కు చేరుకునే అవకాశం ఉందన్న అంచనాతో, వారిని నిలువరించేందుకు ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలకు చెందిన దాదాపు 35 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. గతంలో జూన్-జులై నెలల్లో సీజేపీ చేపట్టిన నిరసనకు పెద్ద ఎత్తున జనాలు రావడాన్ని తక్కువగా అంచనా వేశామని, అందుకే ఈసారి ముందస్తుగా అదనపు బలగాలను కోరామని పోలీస్ వర్గాలు వెల్లడించారు.
భద్రతా కారణాల దృష్ట్యా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచే జనపథ్-కర్తవ్య పథ్ క్రాసింగ్ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ఆంక్షలు శనివారం రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయి. అలాగే, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా 57 మెట్రో స్టేషన్లలో (ఆ తర్వాత ఈ సంఖ్యను 45కు తగ్గించారు) ప్రయాణికుల రాకపోకలను నిలిపివేయాలని ఢిల్లీ మెట్రోకు పోలీసులు సూచించారు. నగర సరిహద్దులతో పాటు 30కి పైగా ప్రదేశాల్లో తీవ్రమైన నాకాబంధీ ఏర్పాటు చేశారు. నగరంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నించినా లేదా నిరసన ప్రదేశానికి వెళ్లాలని చూసినా వెంటనే అదుపులోకి తీసుకుంటామని, ముఖ్యంగా నగర సరిహద్దుల వద్దే వారిని అడ్డుకోవడమే తమ ప్రధాన ప్లాన్ అని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ముఖ్యమైన ప్రవేశ మార్గాల వద్ద వాహనదారులను సైతం ఎక్కడికి వెళ్తున్నారో అడిగి మరీ లోపలికి పంపుతున్నారు.
Also Read
మరోవైపు, ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంపై జాయింట్ సీపీ నూపూర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సీజేపీ శనివారం నాటి నిరసనకు సంబంధించి అక్టోబర్ 7న చాలా తక్కువ వ్యవధిలో దరఖాస్తు చేసుకుందని, నిబంధనల ప్రకారం కనీసం 10 రోజుల ముందే దరఖాస్తు చేయాలని తెలిపారు. అంతేకాకుండా, గతంలో అనుమతి ఇచ్చినప్పుడు కూడా వారు ఇచ్చిన హామీలను, చట్టపరమైన నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని, అందుకే ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా ఈసారి అనుమతి ఇవ్వలేదని వివరించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ తీవ్రంగా స్పందించారు. అక్టోబర్ 2న నిరసన గురించి ప్రకటించినప్పటి నుంచే పోలీసులకు సమాచారం ఉందన్నారు. 10 రోజుల గడువు అనేది కేవలం భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సర్దుబాటు కోసమేనని, పైగా అదే అంశంపై ఇతర సంఘాలు కూడా నిరసన తెలుపుతుండటంతో అంతకుముందు నుంచే బలగాల మోహరింపు ఉందన్నారు. నిరసనను అడ్డుకోవడానికి పోలీసులు సాకులు చెప్తున్నారని, ప్రభుత్వంపై నిరసన తెలపడానికి ప్రభుత్వ పరిమితులేమిటని ప్రశ్నించారు. అనుమతి తీసుకోవాలనే భావన వెనుక బ్రిటిష్ కాలం నాటి మానసిక ధోరణి కనిపిస్తోందని ఆయన విమర్శించారు.
పరిస్థితిని అదుపులో ఉంచే క్రమంలో జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మధుర్ వర్మ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అదే సమయంలో సహనం వహించి శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు. గుంపును అదుపు చేయడంలోనే కాదు, క్రమశిక్షణ, గౌరవం, అతి తక్కువ బలాన్ని ఉపయోగిస్తూ పనిచేయడంలోనే పోలీసుల అసలైన బలం ఉందన్నారు. అంతేకాకుండా, ఢిల్లీ పోలీస్ అధికారికంగా ఒక పోస్ట్‌కార్డ్ ద్వారా ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేసింది. “మీ గొంతు విప్పడం మీ హక్కు, మీ రక్షణ మా బాధ్యత. యూనిఫాం వెనుక కూడా ఒక మనిషి ఉన్నాడు, అతనికి కుటుంబం ఉంది. తేడా అంతా యూనిఫాంలోనే ఉంది తప్ప మానవత్వంలో కాదు” అంటూ ఎమోషనల్‌గా ప్రజలను శాంతిభద్రతలకు సహకరించాలని కోరింది. రాజ్యాంగబద్ధమైన కార్యాలయాలు ఉన్న న్యూఢిల్లీలో నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ, అక్కడి వ్యాపారాలు, ప్రజలు, ఉద్యోగుల భద్రత కూడా ముఖ్యమని పోలీసులు తమ చర్యలను సమర్థించుకున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు