INDvsAUS : నాలుగో టెస్ట్ డ్రా.. సీరిస్ కైవసం చేసుకున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరు అనుకున్నట్టుగానే ఎలాంటి హైడ్రామా లేకుండా అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా.. మూడో టెస్టులో ఓడినా 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. మొట్టమొదటిసారిగా వరుసగా నాలుగు సార్లు బోర్డర్ గవాస్కర్ గెలిచిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటికే మూడో టెస్టు గెలిచిన ఆస్ట్రేలియా.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా.. న్యూజిలాండ్ చేతుల్లో శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియా కూడా ఫైనల్ కు అర్హత సాధించింది.
Also Read : Ys Sunitha Reddy: సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్… కీలక అంశాలు
Also Read
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
- VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు... వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా... వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ఓవర్ నైట్ స్కోర్ 3/0 వద్ద ఆఖరి రోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా .. 78.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసింది. ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా కంటే 84 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ జట్టు ఉంది. నైట్ వాచ్ మెన్ గా వచ్చిన మథ్యూ కుహ్నేమన్ 6 పరుగులు చేసి అవుట్ కాగా ట్రావిస్ హెచ్ 163 బంతుల్లో 10 పోర్లు, 2 సిక్సర్లతో 90 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సీరిస్ మొదటి మూడు టెస్టుల్లో, నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయిన ఐసీసీ నెంబర్ 1 టెస్ట్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 213 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనితో పాటు స్టీవ్ స్మిత్ 59 బంతుల్లో 2 పోర్లతో 10 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
Also Read : Siddharth-Aditi: ఇక్కడ పవిత్ర- నరేష్.. అక్కడ సిద్దార్థ్- అదితి.. పవిత్ర బంధమట
పిచ్ ఎంతకీ బౌలర్లకు సహకరించకపోవడంతో పూర్తి ఓవర్ల పాటు ఆడినా వృథాయేనని భావించిన ఇరు జట్ల కెప్లెన్లు డ్రాకి అంగీకరించారు. ఎంతకీ వికెట్లు పడకపోవడంతో శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పూజారాలతో కూడా బౌలింగ్ రోహిత్ శర్మ చేయించాడు. శుబ్ మన్ గిల్ 79వ ఓవర్ లో ఓ బాల్ వేసిన తర్వాత రోహిత్, స్టీవ్ స్మిత్ తో మాట్లాడి డ్రాకి ఒప్పించడంతో మ్యాచ్ ముగిసిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులకి ఆలౌట్ అయింది. ఓపెనర ఉస్మాన్ ఖవాజా 180 పరుగుల చేయగా కామెరూన్ గ్రీన్ 114 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీశాడు. బదులుగా టీమిండియా తొలి ఇన్సింగ్ లో 571 పరుగులకీ ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ 186 పరుగులు చేయగా శుభ్ మన్ గిల్ 128 రన్స్ చేశాడు.
Also Read : Top Headlines @5PM: టాప్ న్యూస్
తన కెరీర్ లో ఆరు టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మకు ఇదే మొట్టమొదటి డ్రా.. తొలి నాలుగు టెస్టుల్లో విజయాలు అందుకున్న రోహిత్ శర్మ, ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో తొలి పరాజయాన్ని చవిచూశాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి ఇండియా-ఆసీస్ జట్లు అర్హత సాధించాయి. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ లో టైటిల్ ఫైట్ లో పాల్గొంటాయి. ఇంగ్లాండ్ లో ది ఓవల్ లో జూన్ 7 టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తాజావార్తలు
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!