Common Wealth Games 2026: 2026లో కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగనున్నాయి. ఈ మేరకు 2026లో జరిగే ఎడిషన్‌లో ఉండబోయే స్పోర్ట్స్ లిస్ట్‌ను కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ జాబితాలో 2022లో లేని షూటింగ్‌ను నిర్వాహకులు చేర్చారు. అయితే రెజ్లింగ్‌ను మాత్రం తొలగించారు. 2026లో మొత్తం 20 క్రీడలు, 26 �
భారతదేశం తన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైంది. దేశభక్తి భావన పౌరుల హృదయాలను నింపుతోంది. ఈ చారిత్రాత్మక దినానికి గుర్తుగా అనేక స్మారక చిహ్నాలు, ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ పతాకంతో అలంకరించబడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 'తిరంగ'ను ఎగురవే�
తెలుగు తేజం, కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ విజేత పీవీ సింధు విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2022 చివరి రోజున భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతం చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి మువ్వన్నెల జె�
కామన్వెల్త్ గేమ్స్-2022లో చివరి రోజు భారత్ పతకాల పంట పండించింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో సింధు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా పురుషుల డబుల్స్ విభాగంలోనూ భారత్ మరో స్వర్ణం అందుకుంది
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత టేబుల్ టెన్నిస్ సంచలనం సత్యన్ జ్ఞానశేఖరన్‌కు ఈ కామన్వెల్త్ గేమ్స్ గుర్తుండిపోతుంది. టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు సత్యన్ జ్ఞానశేఖరన్ కాంస్యాన్ని సాధించాడు.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ బంగారు పతకాన్ని సాధించాడు.
కామన్వెల్త్ క్రీడలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ్టితో ఆ క్రీడలు ముగియనుండగా.. భారత క్రీడాకారులు మాత్రం అదరగొడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించింది.కెనడాకు చెందిన మిచెల్ లీతో మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ భారత పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్ చరిత్ర సృష్టించింది. పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ 3-5తో స్వర్ణ పతకం సాధించింది.
ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 40 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇందులో 13 స్వర్ణాలు, 11రజతాలు, 16 కాంస్య పతకాలు భారత్‌కు లభించాయి.
ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 26 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇందులో 9 స్వర్ణాలు, 8రజతాలు, 9 కాంస్య పతకాలు భారత్‌కు లభించాయి.