IND vs SA T20i: దక్షిణాఫ్రికా- భారత్ జట్ల మధ్య డిసెంబర్ 9వ తేదీ నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా సెలక్టర్లు జట్టును తాజాగా ప్రకటించారు.
దక్షిణాఫ్రితో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు రిషభ్ పంత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే! అయితే, అతడు సమర్థవంతంగా జట్టుని నడిపించలేకపోయాడని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా.. మొదట్లో రెండు మ్యాచ్‌లు ఘోరంగా ఓడిపోవడంతో, అతడి కెప్టెన్సీని అందరూ తప్పుపట్టారు. ఎలాంటి నాయకత్వ లక్షణాలు అతనిలో లేవని, రిషభ్ స్థానంలో ఓ సీనియర్ ఆటగాడ్ని కెప్టెన్‌గా ఎంపిక చేయాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తొలి రెండు ఓటముల తర్వాత భారత్ రెండు మ్యాచ్‌లు కైవసం చేసుకున్నా.. అందులో రిషభ్…
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై క్రీడాభిమానుల నుంచి ఏ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైందో అందరికీ తెలిసిందే! కొందరు మాజీలు సైతం అతడ్ని సెలక్ట్ చేయనందుకు పెదవి విరిచారు. అతడో గొప్ప ఆటగాడని, అవకాశాలు ఇస్తేనే సత్తా చాటుకోవడానికి వీలుంటుందని, కానీ ఎందుకు అతడ్ని జట్టులో తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటు, క్రీడాభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐపీఎల్‌లో…
విశాఖపట్నంలో డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే! తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగింది. ఓపెనర్లైతే భారత్‌కి శుభారంభాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57 పరుగులు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54 పరుగులు)లు ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించారు.…
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ రెండు మ్యాచ్‌లు ముగిసిపోయాయి. రేపు మూడో మ్యాచ్ విశాఖపట్నంలోని డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే భారత్, దక్షిణాఫ్రికా జట్లు విశాఖపట్నంకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రుషికొండ బీచ్‌లో మన భారత క్రికెటర్లు కాసేపు సందడి చేశారు. పైగా, బీచ్ రోడ్‌లోని ఓ హోటల్‌లోనే ఇరు జట్ల క్రీడాకారులు బస చేస్తున్నారు. బీచ్ పక్కనే…
భారీ స్కోరు చేసినా తొలి టీ20 మ్యాచ్ ఓడిపోవడంతో.. రెండో మ్యాచ్ నెగ్గి దక్షిణాఫ్రికాపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఈసారి బ్యాట్స్మన్లు చేతులెత్తేయడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో.. ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో దఫ్రికాఫ్రికా 2-0తో ఆధిక్యంలో ఉంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మన్లను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చివరివరకూ ప్రయత్నించారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, రిషభ్ పంత్ మాత్రం మరింత మెరుగ్గా బౌలింగ్ వేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.…
కటక్ వేదికగా జరిగిన భారత్,దక్షిణాఫ్రికా రెండవ టీ20 లో భారత్ భొక్కబోర్ల పడింది. తొలుత టాస్ గెలిచినా దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుండే తడపడింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే గైక్వాడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తరువాత వచ్చిన భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతాడనుకున్న కెప్టెన్ పంత్ కూడా అనవసరపు షాట్ ఆడీ వికెట్ సమర్పించుకున్నాడు. ఓపెనర్ ఇషాంత్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్…
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే! భారీ స్కోరు (211) చేసినప్పటికీ.. బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా బోల్తా కొట్టేసింది. దీంతో, ఈరోజు జరగనున్న రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. అందుకు బౌలింగ్ విభాగంలో భారత్ పుంజుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విషయంలో భారత్‌కి ఎలాంటి ఢోకా లేదు. ఆరో వికెట్ దాకా దూకుడుగా రాణించే బ్యాట్స్మన్లే ఉన్నారు.…
వరుసగా 13 మ్యాచులు గెలిచి, ప్రపంచ రికార్డు విజయం సాధించాలనుకున్న టీమిండియా ఆశ నెరవేరలేదు. తొలి T20 ముందు వరకు కూడా 12 విజయాలతో పొట్టి ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్, రొమేనియాలతో కలిసి సమానంగా ఉన్న భారత్ జట్టుకు దక్షిణాఫ్రికా రూపంలో కళ్లెం పడింది. దాంతో వరుస విజయాల రికార్డును తన పేరిట లిఖించుకోలేకపోయింది. ఇక రేపు జరిగే రెండో T20 కోసం భారత జట్టు సిద్ధం అవుతోంది. ఒడిశా వేదికగా…
జూన్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే! అయితే.. రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, బుమ్రాలను విశ్రాంతి పేరిట ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కొంతకాలం నుంచి తీరిక లేకుండా ఆడుతున్న ఈ సీనియర్లకు విశ్రాంతి తప్పదని చెప్పి, సెలెక్టర్లు తుది జట్టులోకి వారిని తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ.. రోహిత్ శర్మకు విశ్రాంతీ తీసుకోవాల్సిన…