IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. భారత్ తుది జట్టు ఇదే! గిల్, సూరీడు తప్ప..
- మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైన భారత్
- ముల్లాన్‌పుర్ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20
- గిల్, సూరీడు తప్ప అంతా ఓకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa 2nd T20 Playing XI: భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ముల్లాన్‌పుర్ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20 ఆడనుంది. మంగళవారం కటక్‌లో జరిగిన తొలి టీ20లో సఫారీలను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా.. అదే ఊపును రెండో టీ20లో కూడా కొనసాగించాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినప్పటికీ దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేము. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న సఫారీలు రెండో టీ20 చెలరేగగాలని చూస్తున్నారు. సూర్య సేన ఆధిక్యం 2-0కు పెరుగుతుందా.. లేదా దక్షిణాఫ్రికా 1-1తో సిరీస్ సమయం చేస్తుందా చూడాలి.
తొలి టీ20లో భారత్ గెలిచినా బ్యాటింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. హార్దిక్ పాండ్యా చెలరేగకపోయుంటే ఫలితం మరోలా ఉండేది. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. టీ20 ఓపెనర్ అవతారం ఎత్తినప్పటి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. సంజు శాంసన్‌ను తప్పించి మరీ ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా.. వన్డే, టెస్ట్ మాదిరి సక్సెస్ అవ్వడం లేదు. టీ20 ప్రపంచకప్ 2026 ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో అయినా గిల్ నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కూడా జట్టును ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కాలంగా నిలకడగా ఆడలేకపోతున్న సూరీడు కూడా పరుగులు చేయాల్సి ఉంది.
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు భారీగా పరుగులు చేస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. హార్దిక్ పాండ్యా పునరాగమనంలో చెలరేగడం శుభపరిణామం. శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మలు పరుగులు చేస్తే భారీ స్కోరు ఖాయం. ఇక బౌలర్లు రాణిస్తుండడం మంచి విషయం. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ చెలరేగుతున్నారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ వికెట్స్ తీస్తున్నారు. ఆల్‌రౌండర్‌లు దూబే, హార్దిక్ కూడా సత్తా చాటితే తిరుగుండదు. రెండో టీ20కి తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు లేవు. ఇక ఘోర పరాజయం చవిచూసిన దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో చెలరేగాలని చూస్తోంది. సఫారీలు కూడా
ముల్లాన్‌పుర్‌లోని పీసీఏ కొత్త స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. నేడు మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఈ మైదానంలో 11 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 6 సార్లు గెలిచింది. 200 ప్లస్ టార్గెట్ ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరించనుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, ఐడెన్ మార్‌క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డెవల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెస్, సిపమ్లా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!