Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
- నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి టీ20
- వైభవ్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కుతుందా?
- ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిన ఇంగ్లండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Brook Confident England Can Tackle Vaibhav Sooryavanshi: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం (జులై 1) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు సోషల్ మీడియాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్‌కు భారత జట్టు తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. బుడ్డోడు ఆడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే వైభవ్‌ను ఎదుర్కొనేందుకు తమ జట్టు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వెల్లడించాడు.
వైభవ్ కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం:
మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన హ్యారీ బ్రూక్.. వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలను రూపొందించినట్లు తెలిపాడు. ‘మా వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి. అవి వర్కౌట్ అవుతాయని ఆశిస్తున్నాం. భారత బ్యాటర్లు తమ అత్యుత్తమ ఆట ఆడకుండా ఎలా అడ్డుకోవాలనే దానిపై తెరవెనుక చాలా కసరత్తు చేశాం. వైభవ్ సూర్యవంశీ ఆడితే.. అతడికి ఓ ప్లాన్ సిద్ధం చేశాం. సూర్యవంశీని ఈజీగా బుట్టలో వేస్తాం’ అని బ్రూక్ పేర్కొన్నాడు.
Also Read
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ఐపీఎల్లో అదరగొట్టిన వైభవ్:
ఈ ఏడాది ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 230కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 776 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’, ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’, ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
చరిత్ర సృష్టించే అవకాశం:
ఇంగ్లండ్‌తో జరిగే ఈ సిరీస్‌లో వైభవ్‌కు అరంగేట్రం అవకాశం లభిస్తే.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు 16 ఏళ్ల వయసులో భారత జట్టులో అరంగేట్రం చేసిన దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. దీంతో వైభవ్‌పై అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!