Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెడ్డన్ పార్క్ వేదికగా జరిగిన ఐదో T20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో అలరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది.
ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్స్ అభిషేక శర్మ ఒక్క పరుగు, సంజు సామ్సన్ 4 పరుగులతో నిరాశపరిశారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ , కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. వీరిద్దరూ కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్టేడియం నలుమూలలా భారీ షాట్లు బాదారు.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
- Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
- CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి అదరగొట్టాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 50 పరుగులు పూర్తి చేసుకుని మెరుపు అర్ధశతకం సాధించాడు. ఈ ఇద్దరి విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
వీరితో పాటు మిడిలార్డర్లో నమన్ ధిర్ 33 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. నితీష్ కుమార్ రెడ్డి 22 పరుగులు జోడించారు. చివర్లో కివీస్ బౌలర్లు కట్టడి చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగలిగింది.
న్యూజిలాండ్ బౌలర్లలో ఆదం మిల్నే అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అలాగే నాథన్ స్మిత్, బ్లైర్ టిక్నర్ చెరో రెండు వికెట్లు సాధించారు. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుతో పోరాటం రసవత్తరంగా సాగింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే దిశగా అడుగులు వేసింది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌లు ఈ మ్యాచ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!