GTvsLSG: గిల్ క్లాస్.. బట్లర్ మాస్.. లక్నోను చిత్తు చేసిన గుజరాత్ ఓపెనర్లు..
- గిల్-బట్లర్ ఓపెనింగ్ షో
- లక్ష్యాన్ని సులభంగా ఛేదించిన గుజరాత్
- ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ మెరుపు
- అన్ని విభాగాల్లో GT డామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంతో కనిపిస్తున్న గుజరాత్, లక్నో నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న ఈ పోరులో గుజరాత్ ఓపెనర్లు లక్నో బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి, తమ జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించారు.
Pakistan: యుద్ధంలోకి పాకిస్తాన్.. సౌదీలో పాక్ సైన్యం మోహరింపు..
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
ఛేదనలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ , జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. గిల్ తన క్లాస్ షాట్లతో అలరిస్తూ 40 బంతుల్లో 56 పరుగులు చేయగా, మరోవైపు బట్లర్ తన టీ20 కెరీర్‌లో 100వ అర్ధ సెంచరీ మార్కును అందుకుంటూ 37 బంతుల్లోనే 60 పరుగులు సాధించి జట్టు విజయాన్ని సులభతరం చేశారు. మధ్యలో సాయి సుదర్శన్ (15) , చివరలో వాషింగ్టన్ సుందర్ (20 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ లక్ష్యం వైపు అలవోకగా దూసుకెళ్లింది. లక్నో బౌలర్లలో ప్రన్ష్ యాదవ్, షమీ , దిగ్వేష్ రాఠీ చెరో వికెట్ తీసినప్పటికీ, గుజరాత్ బ్యాటర్ల జోరును అడ్డుకోవడంలో వారు విఫలమయ్యారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. గుజరాత్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన అద్భుతమైన బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన ప్రసిద్ధ్, లక్నో మిడిలార్డర్ వెన్నువిరిచాడు. ఓపెనర్లు మార్క్రమ్ (30), మిచెల్ మార్ష్ (11) విఫలం కాగా, కెప్టెన్ రిషబ్ పంత్ (18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. చివరలో మహమ్మద్ షమీ కొన్ని కీలక పరుగులు జోడించడంతో లక్నో గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఏదేమైనా, సమష్టి కృషితో రాణించిన గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో లక్నోను అన్ని విభాగాల్లోనూ చిత్తు చేసి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
LSG vs GT: లక్నో బ్యాటర్లను వణికించిన గుజరాత్ బౌలర్లు.. గిల్ సేన టార్గెట్ ఎంతంటే!
తాజావార్తలు
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు