LSG vs GT: లక్నో బ్యాటర్లను వణికించిన గుజరాత్ బౌలర్లు.. గిల్ సేన టార్గెట్ ఎంతంటే!
- 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు లక్నో
- గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 165 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LSG vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన పోరులో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించి లక్నోను కట్టడి చేయడంతో, సొంత గడ్డపై లక్నో మోస్తరు స్కోరుకే పరిమితమైంది. గుజరాత్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన అద్భుతమైన బౌలింగ్‌తో లక్నో వెన్ను విరిచాడు. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి, ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు (10) తీసిన బౌలర్‌గా నిలిచాడు. ముఖ్యంగా మిడిలార్డర్‌లో ముకుల్ చౌదరి, నికోలస్ పూరన్ వంటి కీలక వికెట్లు తీసి లక్నోను కోలుకోలేని దెబ్బ తీశాడు ఈ బౌలర్.
READ ALSO: Devendra Fadnavis: కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని తొలగించవచ్చు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
కుప్పకూలిన టాప్ ఆర్డర్
ఓపెనర్లుగా వచ్చిన ఐడెన్ మార్క్రమ్ (30), మిచెల్ మార్ష్ (11) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కెప్టెన్ పంత్ (11 బంతుల్లో 18) మెరుపులు మెరిపించినప్పటికీ, సిరాజ్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. చివరలో మహమ్మద్ షమీ (12 నాటౌట్), అవేష్ ఖాన్ (4) కొన్ని కీలక పరుగులు జోడించడంతో లక్నో స్కోరు 160 మార్కును దాటింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ (4/28), మిగిలిన వారు కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో లక్నోను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయగలిగారు. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి పంత్ వికెట్ తీశాడు. అలాగే అశోక్ శర్మ చివరలో పరుగులు ఇచ్చినప్పటికీ, 2 కీలక వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ వికెట్లు తీయకపోయినా, 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి ప్రత్యర్థి జట్టు పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతుంది.
పిచ్ బ్యాటింగ్‌కు కొంచెం కష్టంగా కనిపిస్తోంది. 165 పరుగుల లక్ష్యం చిన్నదే అయినప్పటికీ, లక్నో బౌలర్లు గట్టిగా పోరాడితే గుజరాత్‌కు కష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా షమీ బ్యాటింగ్‌లో చూపించిన జోష్‌ను బౌలింగ్‌లోనూ చూపిస్తే మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉందన్నారు.
READ ALSO: Asha Bhosle: ఆశా భోస్లే సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే!
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!