విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుండి తప్పిస్తున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది బీసీసీఐ. దాంతో కోహ్లీ అభిమానులు బీసీసీఐ పై చాలా కోపంతో ఉన్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై చాలా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీసీసీఐ చేసిన పని వారిలో కోపాన్ని మరింత పెంచింది. అదే బీసీసీఐ కోహ్లీకి ధన్యవాదాలు చెప్పడం. అయితే ఇన్ని రోజులు వన్డే జట్టును నడిపిన కోహ్లీకి ధన్యవాదాలు చెప్తూ బీసీసీఐ ఓ పోస్టర్ విడుదల చేసింది. దాంతో బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్.
నిన్న కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించి… ఈరోజు అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అది కూడా కేవలం ఒక్క పోస్టర్ ద్వారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను జట్టు కోసం చాలా చేసాడు. అందులోని వాటిని ఎడిట్ చేసి ఓ వీడియో విడుదల చేయడానికి.. మీ దగ్గర మంచి ఎడిటర్ కూడా లేడా అని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు కోహ్లీ అభిమానులు.