కరోనా కారణంగా కొన్ని రోజులు ప్రపంచ మొత్తం స్తంభించిన విషయ తెలిసిందే. అయితే ఆ సమయంలో టిక్ టాక్ ద్వారా తెలుగు అభిమానులకు చాలా దగ్గర అయ్యాడు మాజీ సన్ రైజర్స్ కెప్టెన్ దేవి వార్నర్. మొదట్లో మహేష్ బాబు డైలాగులు పాటలతో వచ్చిన వార్నర్ ఆ తర్వాత అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ ద్వారా ఇంకా పాపులర్ అయ్యాడు. కానీ ఆయా తర్వాత ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేయడంతో ఇంస్టాగ్రామ్ ద్వారా ఆప్పుడప్పుడు అభిమానుల ముందుకు వచ్చిన వార్నర్.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరో బన్నీ సాంగ్ వచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా తాజాగా వస్తున్న చిత్రం పుష్ప. ఇందులో ఏ బిడ్డ.. ఇది నా అడ్డా అనే సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఆ సాంగ్ తో అభిమానుల ముందుకు వార్నర్ వచ్చాడు. ఆ పాటలో తన ఫెస్ ను ఎడిట్ చేసి పోస్ట్ చేసాడు.
అయితే ఈ వీడియో చాలా అభిమానులతో పాటుగా క్రికెటర్స్ ను కూడా ఆకట్టుకుంది. తాజాగా దీనికి రిప్లై ఇచ్చిన భారత టెస్ట్ విరాట్ కోహ్లీ కామెంట్ చేసాడు. ‘ మెట్ నువ్వు ఓకేనా..?’ అని కోహ్లీ కామెంట్ పెట్టాడు. అలాగే మిచెల్ జాన్సన్ ”ఇక ఆపు ప్లీజ్” అంటూ కామెంట్ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CXVv7sbJU1X/