విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ చేసిన హఠాత్తు ప్రకటన పై చాలా విషయాలు వచ్చిన విషయం తెలిసిందే. కోహ్లీకి మద్దతుగా చాలా మంది అభిమానులు బీసీసీఐ ని తప్పు బట్టారు. ఇప్పుడు అందులో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా చేరాడు. తాజాగా ఈ విషయం పై స్పందించిన కనేరియా… నేను కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం పై మాట్లాడటం లేదు. కానీ తప్పించిన విధానం కరెక్ట్ కాదు అని అన్నారు. జట్టు ఆటగాడిగా… కెప్టెన్ గా అతను ఎంతో చేసాడు. అలాగే ఎన్ని రికార్డులు కూడా సృష్టించాడు. కాబట్టి అతనికి కాకపోయినా అతని కెప్టెన్సీకైనా గౌరవం ఇవ్వండి అని కనేరియా తెలిపాడు. అయితే ఈ బుధవారం సౌత్ ఆఫ్రికా వెళ్లే భారత టెస్ట్ జట్టును ప్రకటిస్తూ… వన్డే కెప్టెన్సీ భాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.