ప్రస్తుతం టీమిండియాలో విరాట్ కోహ్లీ-గంగూలీ ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై విరాట్ కోహ్లీ అసంతృప్తిగా ఉన్నాడనే విషయం అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తనకు చెప్పకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని.. టీ20 కెప్టెన్సీకి తాను రాజీనామా చేసినప్పుడు తనకు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలనే విషయం చెప్పలేదని కోహ్లీ చెప్పడంతో వివాదం చెలరేగింది. మరోవైపు విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని చెప్పినా వినలేదని గతంలో గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే.
Read Also: జాతీయ స్థాయి మహిళా షూటర్ అనుమానాస్పద మృతి
అయితే వీరిద్దరి మాటలు పొంతన లేకుండా ఉండటంతో టీమిండియాలో తెరవెనుక ఏదో జరుగుతోందనే విషయం బట్టబయలవుతోంది. అయితే ఈ వివాదంపై గంగూలీ స్పందించాడు. అయితే కోహ్లీ వ్యాఖ్యలపై సూటిగా సమాధానం చెప్పేందుకు గంగూలీ ఆసక్తి చూపించలేదు. ‘దీనిపై నేను చెప్పేదేమీ లేదు. ఈ విషయాన్ని బీసీసీఐకి వదిలేయండి… మేం చూసుకుంటాం’ అంటూ గంగూలీ సమాధానం దాటవేశాడు. ఈ వివాదంపై స్పందించేందుకు తొలుత సెలక్షన్ కమిటీతో సమావేశం నిర్వహించాలని బీసీసీఐ భావించగా… ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా ఈ సమావేశం జరిపేందుకు గంగూలీ ఆసక్తి చూపలేదు.