BCCI New Rule: బీసీసీఐ సరికొత్త రూల్.. ఆ విషయంలో అంపైర్లదే తుది నిర్ణయం
- సరికొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ..
- మ్యాచ్ సమయంలో గాయపడిన ప్లేయర్ ప్లేస్ లో మరొకరికి ఛాన్స్..
- ఈ ఏడాది నుంచి ఈ రూల్ అమలు కాబోతుంది: బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI New Rule: ఇంగ్లాండ్ టూర్ లో రిషభ్ పంత్ గాయపడిన తర్వాత కుంటుతూనే బ్యాటింగ్ కు వచ్చాడు. నొప్పిని భరిస్తూనే గ్రౌండ్ లో బ్యాటింగ్ చేయడం చూశాం.. ఇక, రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌ను తీసుకొని ఉంటే పంత్‌కు ఇబ్బంది తప్పేదిగా అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి సరికొత్త రూల్ తీసుకొచ్చింది. మ్యాచ్ టైంలో తీవ్రంగా గాయపడిన ప్లేయర్ స్థానంలో మరొకరిని ఆడించేలా నిబంధనల్లో మార్పు చేసింది. దేశవాళీ సీజన్ 2025-26 నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి రాబోతుందని బీసీసీఐ వెల్లడించింది.
Also Read
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
అయితే, టెస్టులు లాంటి మల్టీ డే మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడు గాయపడితే అతడి ప్లేస్ లో మరొకరిని ఆడించాల్సి ఉంటుంది. ఆ రోజు ఆట పరిస్థితులను బట్టి రీప్లేస్‌మెంట్‌కు పర్మిషన్ తీసుకోవాలి. కాగా, ఆటగాడికి మ్యాచ్ సమయంలో లేదంటే స్టేడియంలో అయినా గాయపడాలి.. అలాంటప్పుడే వాళ్లకు ఈ రూల్ వర్తిస్తుందని చెప్పుకొచ్చింది. కాగా, త్వరలో ప్రారంభం కాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ నుంచే ఈ కొత్త రూల్‌ను అమలు చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది.
Read Also: Harish Rao: కాళేశ్వరంపై ఇంకో కుట్ర.. మోటర్లను కావాలని ఆన్, ఆఫ్ చేస్తున్నారు
ఇక, ఇంగ్లాండ్ లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ టెస్టులో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి.. అతడి కుడి పాదం వేళ్లకు బలంగా బంతి తాకింది.. దాంతో.. పంత్ నొప్పిని తట్టుకోలేక రిటైర్డ్ హర్ట్‌గా బయటకు వెళ్లిపోయాడు. అప్పటికే కాలు వేలు ఎముక విరిగిందని డాక్టర్లు చెప్పినా జట్టును ఆదుకోవాలని మళ్లీ తిరిగి క్రీజులోకి వచ్చి అర్థ శతకం కొట్టాడు. ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ సైతం భుజం నొప్పితో ఓవల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కు చేయలేదు. కాబట్టి, ఒకవేళ రీప్లేస్‌మెంట్ ఆటగాడిని అనుమతించి ఉంటే పంత్, వోక్స్‌లు అంతగా ఇబ్బంది పడేవారు కాదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, బీసీసీఐ రూల్ కి కొందరు మద్దతు ఇస్తుండగా.. మరి కొందరు ఇది సరైంది కాదని పేర్కొంటున్నారు.
🚨 NEW RULE 🚨
BCCI introduces 'Serious Injury Replacement' rule for 2025-26 season in multi-day formats, allowing a like-for-like replacement – somewhat similar to concussion replacement – in case of a major injury to any player.#CricketTwitter pic.twitter.com/C9WGOEHyh9
— Cricbuzz (@cricbuzz) August 16, 2025
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!