OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
- 8.5 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేతో ఐప్యాడ్ మినీ 2026 విడుదల
- 2ఎన్ఎం టెక్నాలజీతో తయారైన ఏ20 ప్రో చిప్సెట్
- ఐప్యాడ్ఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్..
- ముందు భాగంలో 12ఎంపీ ల్యాండ్‌స్కేప్ సెంటర్ స్టేజ్ కెమెరా
- వెనుకవైపు 12ఎంపీ వైడ్ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple iPad mini (2026): టెక్ దిగ్గజం సంస్థ యాపిల్ (Apple) నుండి ఐప్యాడ్ మినీ (2026)ను భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్లలో సోమవారం అధికారికంగా విడుదల చేసింది. తన మొట్టమొదటి టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రోను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న ‘ప్రో అండ్ టెల్’ ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందే ఈ కాంపాక్ట్ టాబ్లెట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. సరికొత్త 8.5 అంగుళాల OLED స్క్రీన్‌తో వచ్చిన తొలి ఐప్యాడ్ మినీ మోడల్ ఇదే. వీటితోపాటు అత్యంత శక్తివంతమైన A20 Pro చిప్సెట్, ల్యాండ్‌స్కేప్ ఫ్రంట్ కెమెరా, ఐప్యాడ్ ఓఎస్ 27, అధునాతన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఇది రూపొందింది.
డిస్ప్లే, అకౌస్టిక్ ఆడియో
ఐప్యాడ్ మినీ (2026)లో 8.5 అంగుళాల సూపర్ రెటినా XDR (2316 x 1512 పిక్సెల్స్) OLED డిస్ప్లేను అమర్చారు. ఇది P3 వైడ్ కలర్ గామట్ సపోర్ట్‌తో పాటు గరిష్టంగా 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఆడియో విభాగంలో ఈసారి సరికొత్త ‘అకౌస్టిక్ డిస్ప్లే’ సిస్టమ్‌ను పరిచయం చేశారు. టాబ్లెట్ గ్లాస్, అల్యూమినియం బాడీ మధ్య ప్రత్యేకంగా రూపొందించిన వూఫర్లు, కస్టమ్ ట్వీటర్లను అమర్చారు. దీనివల్ల స్క్రీన్ నుంచే నేరుగా సౌండ్ వస్తుంది.
Also Read
- 11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
- Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
- AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
2nm A20 Pro చిప్సెట్
ఈ టాబ్లెట్ 2nm ప్రాసెస్‌పై ఆధారపడిన యాపిల్ A20 Pro చిప్‌తో పనిచేస్తుంది. ఇందులో న్యూరల్ యాక్సిలరేటర్లతో కూడిన 7-కోర్ GPU ఉంది. 128GB, 256GB మోడళ్లలో 5-కోర్ CPU ఉండగా, 512GB వేరియంట్లో 6-కోర్ CPU లభిస్తుంది. మునుపటి తరం ఐప్యాడ్ మినీతో పోలిస్తే ఇది 4.5 రెట్లు వేగవంతమైన AI పనితీరును, 2.7 రెట్లు మెరుగైన గ్రాఫిక్స్ పనితీరును, 60% వరకు వేగవంతమైన మల్టీ-థ్రెడెడ్ CPU పనితీరును అందిస్తుందని యాపిల్ వెల్లడించింది. ఇది సరికొత్త ఐప్యాడ్ ఓఎస్ 27 (iPadOS 27) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అధునాతన సిరి AI తో పాటు నూతన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను పూర్తిగా సపోర్ట్ చేస్తుంది.
కెమెరా & కనెక్టివిటీ ఫీచర్లు
వీడియో కాల్స్ సౌకర్యార్థం ముందు భాగంలో ల్యాండ్‌స్కేప్ ఓరియెంటెడ్ 12 MP సెంటర్ స్టేజ్ కెమెరాను అమర్చారు. వెనుకవైపు స్మార్ట్ HDR 4 సపోర్ట్, 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సదుపాయం కలిగిన 12 MP వైడ్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ పరంగా ఇందులో యాపిల్ N1 వైర్లెస్ నెట్వర్కింగ్ చిప్, Wi-Fi 7, బ్లూటూత్ 6.0 ఉన్నాయి. సెల్యులార్ మోడళ్లలో C2 మోడెమ్‌ను అమర్చారు. ఇది మునుపటి కంటే 50% వేగవంతమైన డేటా స్పీడ్‌ను ఇవ్వడంతో పాటు eSIM సదుపాయాన్ని అందిస్తుంది.
ధర
భారత మార్కెట్లో ఐప్యాడ్ మినీ (2026) మిడ్నైట్, స్టార్‌లైట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. Wi-Fi వేరియంట్ (128GB) ప్రారంభ ధర రూ. 82,900 కాగా, Wi-Fi + Cellular వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,00,900 నుండి మొదలు కానున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘ఎడ్యుకేషన్ సేవింగ్స్’ కింద దీన్ని రూ. 76,900 ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇది 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అక్టోబర్ 28 నుంచి యాపిల్ ఇండియా వెబ్సైట్, యాపిల్ స్టోర్ యాప్ ద్వారా ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. నవంబర్ 6 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్లు, అధీకృత రిటైలర్ల వద్ద విక్రయాలు మొదలవుతాయి.
అలాగే, ఈ టాబ్లెట్ కోసం రూ. 8,500 ధరకు కొత్త స్మార్ట్ ఫోలియో (నేవీ బ్లూ, టౌప్ రంగుల్లో)ను కంపెనీ విడుదల చేసింది. అంతేకాకుండా ఇది రూ. 11,900 ధర కలిగిన ‘Apple Pencil Pro’, రూ. 7,900 ధర కలిగిన ‘Apple Pencil (USB-C)’ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.
The iPad mini gets its biggest update ever! 🔥
Are you getting one? https://t.co/FVHY3UddnU
— Apple Hub (@theapplehub) October 26, 2026
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!