Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫామ్ లేని సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ సమయంలో వాటి నుంచి బయటపడటానికి ఇంటి వద్ద చేసిన కఠిన సాధనే ఉపయోగకరంగా మారిందన్నారు. జింబాబ్వేతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 41 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేసిన ఆమె, ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కొనసాగించారు. ముఖ్యంగా వడోదర వేదికగా జరిగిన రెండో వన్డేలో 126 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో దీప్తి శర్మతో మాట్లాడుతూ తన పునరాగమనం వెనకున్న కష్టాన్ని పంచుకున్నారు.
ఫామ్ కోల్పోయిన సమయంలో తాను ఎంతో శ్రమించానని, రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు సెషన్లలో నిరంతరం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు హర్మన్ ప్రీత్ వెల్లడించారు. తాను ఎప్పుడూ ఎక్కువ ప్రాక్టీస్ అవసరమైన ఆటగాళ్ల కోవకు చెందినదానినని పేర్కొన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టానని, బ్యాటింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ఇంటి వద్ద గడిపిన సమయం తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. ప్రాక్టీస్ ఎంత ఎక్కువగా చేస్తే ఆత్మవిశ్వాసం అంతగా పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read
- Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
- Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
- Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
- Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!
ఇక రెండో వన్డే మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ త్వరగా అవుటైనప్పటికీ, హర్మన్ ప్రీత్ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. ప్రతీకా రావల్ (61 పరుగులు)తో కలిసి మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత దీప్తి శర్మ (అజేయంగా 106 పరుగులు)తో కలిసి మరో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అద్భుతంగా రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించి, మ్యాచ్‌ను 121 పరుగుల తేడాతో గెలుచుకోవడంతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ సహచర ఆటగాళ్లతో కలిసి ప్రణాళికాబద్ధంగా ఆడి జట్టును విజయపథంలో నడిపించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..