లార్డ్స్ టెస్ట్ విజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు. పేసర్ జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడన్నాడని ప్రశంసించాడు. చివరి రోజు ఉదయం ఆర్చర్ ఎదో మాయ చేస్తాడని తాను అనుకున్నా అని, అనుకున్నట్లే రెండు వికెట్స్ పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడని పేర్కొన్నాడు. భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ డేంజరస్ బ్యాటర్ అని, రెండు ఇన్నింగ్స్‌ల్లో అతడిని త్వరగా ఔట్ చేయడంతోనే విజయం సాధించామని…