Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఆడించొద్దు.. టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచించాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Batting Position: భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్థానంపై చర్చ మొదలైంది. 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న ఈ యువ ఆటగాడికి భారత జట్టులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ముఖ్యంగా ఓపెనర్‌గా అదరగొట్టే వైభవ్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం సరైన నిర్ణయమేనా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అతడిని నంబర్ 3లో ఆడించగా.. ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై చర్చ మరింత పెరిగింది. సూర్యవంశీని మూడో స్థానంలో ఆడించొద్దని.. ఈ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ ఓసారి ఆలోచించాలి అని మాజీలు కోరుతున్నారు.
భారత జట్టు ఓపెనింగ్ స్థానాల్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లకు మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇస్తోంది. అభిషేక్ స్థానంపై పెద్దగా చర్చ లేకపోయినా.. సంజు విషయంలో మాత్రం పలుమార్లు మార్పులు చోటుచేసుకున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్‌లో టోర్నమెంట్ ఉత్తమ ఆటగాడిగా నిలిచిన సంజుపై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతోంది. దీంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం వచ్చినా.. అతడిని ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపుతోంది. న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ముందు ఇషాన్ కిషన్ కుడి తొడ కండరానికి గాయం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. అయితే ఓపెనింగ్ చేసే అవకాశం ఇవ్వకుండా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంతో అతడు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు.
Also Read
- IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
- Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
- Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
- Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు చేసిన అద్భుత ప్రదర్శనలు అన్ని ఓపెనర్‌గా ఆడినవే. ఐపీఎల్లో భారత ఆటగాడిగా అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు.. కేవలం 35 బంతుల్లోనే శతకం సాధించడం అతడి దూకుడుకు నిదర్శనం. అలాగే 2026 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి సత్తా చాటాడు. పవర్‌ప్లేలో ఫీల్డింగ్ ఆంక్షలను ఉపయోగించుకుంటూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటం వైభవ్ ప్రత్యేకత. తొలి ఆరు ఓవర్లలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచగలడు. అలాంటి ఆటగాడిని మూడో స్థానంలో పంపితే పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి రావచ్చు. దీంతో అతడి సహజమైన దూకుడు తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైభవ్‌ను మూడో స్థానంలో ఆడించడంపై మాజీ భారత క్రికెటర్లు మురళీ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైభవ్ తన అత్యుత్తమ ఆటను ఓపెనర్‌గా ఆడతాడని, అతడిని మిడిలార్డర్‌లోకి పంపడం సరైన నిర్ణయం కాదని వారు అభిప్రాయపడ్డారు. యువ ఆటగాడి సహజమైన ఆటతీరును మార్చడం కంటే, అనుభవం ఉన్న ఆటగాళ్లను వేర్వేరు స్థానాల్లో ఆడించడం మంచిదని సూచించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు వైభవ్ తన సహజమైన ఆటను ఆడలేకపోయాడని అశ్విన్ పేర్కొన్నాడు. ఆరో ఓవర్ సమయంలో క్రీజులోకి రావడం అతడి ఆటతీరుకు సరిపడదని అభిప్రాయపడ్డాడు. సంజును మూడో స్థానంలో ఆడించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయని, వైభవ్‌ను ఓపెనర్‌గా కొనసాగించడంపై టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచించాలని సూచించాడు. ఇషాన్ కిషన్ మూడో మ్యాచ్‌కు కూడా దూరం కానున్న నేపథ్యంలో భారత్ ఎలాంటి బ్యాటింగ్ కూర్పుతో బరిలోకి దిగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. వైభవ్‌కు ఓపెనింగ్ అవకాశం ఇస్తారా? లేక మూడో స్థానంలోనే కొనసాగిస్తారా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఆడించొద్దు.. టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచించాలి!
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!