BCCI: ప్రపంచ దేశాల్లోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ అవతరించింది. మరి అది ఎంత రిచ్చో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బీసీసీఐ ఖాతాలో ఏకంగా రూ. 20 వేల కోట్లకుపైగా నిధులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక, గత ఐదేళ్లలో బోర్డు సంపద దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు టాక్. అయితే, అత్యంత విజయవంతమైన ఐపీఎల్‌తో బీసీసీఐకి భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అలాగే, ఐసీసీ నుంచి వచ్చే వాటాతో పాటు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచుల మీడియా హక్కుల నుంచి మరింత సంపద అందుకుంటుంది. బోర్డు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,623 కోట్ల మిగులును చూపించగా.. 2022-23నాటికి రూ.1,167 కోట్లుగా ఉండేది.
Read Also: Dhadi Shetty Raja: ప్రజా సమస్యలపై మాట్లాడితే సీఎం తిడుతున్నారు.. ఇది పద్ధతేనా?
అయితే, సెప్టెంబర్ 28వ తేదీన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ క్రమంలో 2024 అకౌంట్స్‌కు సంబంధించిన స్టేట్‌మెంట్ వివరాలు బయటకు వచ్చాయి. ఇక, క్రీడా వర్గాల సమాచారం మేరకు.. బీసీసీఐ దగ్గర 2019 నాటికి రూ.6 వేల కోట్లు మాత్రమే ఉండగా.. గత ఐదేళ్లలోనే రూ.14,627 కోట్ల సంపదను ఆర్జించింది. దీంతో మొత్తం రూ.20,686 కోట్లకు ప్రస్తుతం చేరుకుంది. మరే ఇతర క్రికెట్ బోర్డుల దగ్గర కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండే ఛాన్స్ లేదు.
Read Also: TPCC Mahesh Goud : కామారెడ్డి బీసీ సభతో రాష్ట్ర రాజకీయాలకు మలుపు
కాగా, బీసీసీఐ సభ్యులకు కార్యదర్శి సమర్పించిన వివరాల ప్రకారం.. 2019లో రాష్ట్ర క్రికెట్ సంఘాలకు చెల్లించాల్సిన వాటితో కలిపి బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ క్యాష్ రూ.6,059 కోట్లు మాత్రమే.. కానీ, ఇప్పుడు ఆయా సంఘాలకు చెల్లించింది పోగా మిగిలింది రూ.20,686 కోట్లు. అయితే, గత ఐదేళ్లలో రూ.14,627 కోట్ల సంపద అదనంగా వచ్చింది.. ఒక్క గతేడాదే రూ.4,193 కోట్ల ఆదాయాన్ని సమీకరించింది బీసీసీఐ. ఇక, 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ. 1,200 కోట్లను స్టేడియాల్లో మౌలిక సదుపాయాల కోసం కేటాయించగా.. ప్లాటినమ్ జూబ్లీ ఫండ్‌గా రూ. 350 కోట్లు, క్రికెట్ అభివృద్ధి కోసం రూ. 500 కోట్లను కేటాయించింది. అలాగే, రాష్ట్ర క్రికెట్ సంఘాలు రూ.1,990 కోట్లు తీసుకున్నాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి.