బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి పెర్త్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ బీసీసీఐకి తెలియజేసాడు. అతను ఇటీవలే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాగా.. రోహిత్ గైర్హాజరీలో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు.
IND vs NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చాలా రసవత్తంగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్సింగ్స్ లో కివీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 259 రన్స్ చేసిన న్యూజిలాండ్.. రెండు ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా విజయానికి 359 పరుగులు చేయాల్సి ఉంది.
మీర్పూర్ వేదికగా… భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం అయ్యింది.. తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా… రెండో టెస్టులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. తొలి టెస్టులో టీమిండియా అన్ని రంగాల్లో సమష్టిగా రాణించింది. ఓపెనర్లు, మిడిలార్డర్‌తో పాటు టెయిలెండర్లు అద్భుతంగా రాణించారు. చతేశ్వర్ పూజారా, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారీ స్కోరుకి పునాదులు వేశారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్…అసాధారణ బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ ఒక్కటే కాదు..…