Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 ఆసియా గేమ్స్ కోసం జపాన్‌లోని నాగోయాకు చేరుకున్న భారత బృందానికి వసతి విషయంలో వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు ఎదురైన పరిణామం తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిర్వాహకులు ఇద్దరికీ ఒకే గదిని కేటాయించడంతో.. వారు వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారిక వసతి కోసం చెక్ఇన్ చేసే సమయంలో ప్రణతి, మిశ్రాకు ఒకే గది కేటాయించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక నిర్వాహకులు, భారత బృందం అధికారులను సంప్రదించారు.
గంటల ప్రయత్నాల అనంతరం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జోక్యం చేసుకోవడంతో ప్రణతి నాయక్, అశోక్ మిశ్రాకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటైంది. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు 1:30 గంటలకు వసతి గదికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే మిశ్రాకు మరో సమస్య ఎదురైంది. ప్రత్యేక గదికి సంబంధించిన తాళాలు తీసుకునేందుకు వెళ్లినప్పుడు హోటల్ సిబ్బంది రిజిస్టర్లో ఆయన బుకింగ్ కనిపించలేదు. ఇందుకు కారణం అధికారిక పత్రాల్లో జరిగిన చిన్నపాటి పొరపాటే. హోటల్ సిస్టమ్‌లో అశోక్ మిశ్రా పేరులోని ‘I’ అనే అక్షరం నమోదు కాలేదు. దీంతో ఆయన బుకింగ్‌ను గుర్తించడం, అక్రిడిటేషన్‌ను ధ్రువీకరించడం వంటి ప్రక్రియకు మరో 45 నిమిషాలు పట్టింది. దీంతో రాత్రి 2 గంటల తర్వాతే కోచ్ తన గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోగలిగారు.
Also Read
- Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
- India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..
ఈ ఘటనపై ప్రణతి నాయక్ స్పందించారు. వసతి విషయంలో గందరగోళం చోటుచేసుకున్న మాట వాస్తవమేనని, సుమారు రాత్రి 2 గంటల సమయంలో సమస్య పరిష్కారమైందని తెలిపారు. భారత బృందం జపాన్‌కు చేరుకున్నప్పటి నుంచి వసతికి సంబంధించిన పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది అథ్లెట్లు గదుల కేటాయింపు కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చినట్లు సమాచారం. శిక్షణకు వెళ్లడం, పోషకాహారానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలోనూ సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. భారత కబడ్డీ బృందానికి కూడా హోటల్ గదుల కేటాయింపు, చెక్ఇన్లో గందరగోళాలు ఎదురైనట్లు సమాచారం. దీంతో భారత బృందం వసతి, సమన్వయ ఏర్పాట్లపై చర్చ జరుగుతోంది. పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిపాలనా సమస్యలు లేకుండా ఏర్పాట్లు సజావుగా సాగాలని అథ్లెట్లు, కోచ్‌లు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!