పాపం సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. కానీ, సంజూ ఇప్పటి వరకు టీమిండియాలో సరైన అవకాశాలను దక్కించుకోలేకపోయాడు. అతని తర్వాత వచ్చిన ప్లేయర్లు జట్టులో బాగా రాణిస్తుంటే.. శాంసన్ మాత్రం అవకాశాల కోసం ఇంకా వెయిటింగ్ చేస్తునే ఉన్నాడు. అతని వెనక దారిద్రం డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, కెరీర్ ఆరంభంలో ఎంఎస్ ధోనీ కారణంగా వైట్ బాల్ క్రికెట్‌లో స్థానం దక్కించుకోలేకపోయిన సంజూ.. ఆ తర్వాత రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ వల్ల తుది జట్టులోకి రాలేకపోతున్నాడు. వచ్చిన ఛాన్స్ లను వాడుకున్నా.. సంజూని పూర్తిగా వాడుకోవాలనే ఉద్దేశం టీమిండియాకి మాత్రం లేనట్లు కనిపిస్తుంది.
Read Also: Bengaluru: ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లా ఫోజులిచ్చి బీఫ్ మాంసం దోపిడి..
నిజానికి సంజూ శాంసన్‌కి కౌంటీల్లో ఆడే ఛాన్స్ వచ్చింది. త్వరలో కౌంటీ క్లబ్ కాంట్రాక్ట్ ఖాయం అవుతుంది అనగా ఆసియా కప్ 2023 టోర్నీమెంట్ కి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక అయ్యాడు. దీంతో కౌంటీల్లో ఆడాలనే ఆలోచనను అతడు విరమించుకున్నాడు. ఇక, కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో సంజూ శాంసన్ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. కేఎల్ రాహుల్ కోలుకోకపోతే.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి రిజర్వు ప్లేయర్‌గా సంజూని ఆడించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనుకుంది. ఈ కారణంగానే చైనాలో జరగాల్సిన ఆసియా క్రీడలకు కూడా సంజూని ఎంపిక చేయలేదు.
Read Also: Rudramkota: శ్మశానంలో లవ్ స్టోరీ ‘రుద్రం కోట’.. మిస్ కావద్దంటున్న శ్రీకాంత్
కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడం, ఇషాన్ కిషన్ కూడా మిడిల్ ఆర్డర్‌లో ఆడుతుండటంతో సంజూ శాంసన్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో కూడా సంజూకి స్థానం దక్కలేదు. వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి వరుసగా ఛాన్స్ లు ఇస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్, సంజూని మాత్రం పట్టించుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత 8 వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 4 సార్లు డకౌట్ అయ్యాడు. మిగిలిన మ్యాచుల్లో 35+ పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయాడు.
Read Also: Brahmanandam: ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బ్రహ్మీ.. ఎంత అద్భుతంగా చేశాడో..
అయితే, సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్ కావడం వల్లే ఏకంగా వన్డే వరల్డ్ కప్ 2023 ఈవెంట్ కు టీమిండియా ఎంపిక చేసింది. మరోవైపు సంజూ శాంసన్ ఈ ఏడాది ఆడిన 8 వన్డేల్లో రెండు హాఫ్ సెంచరీలు (43 నాటౌట్, 15, 86నాటౌట్, 30, 2నాటౌట్, 36, 9, 51 పరుగులు ) పలు కీలక ఇన్సింగ్స్ కూడా ఆడాడు. అయితే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్.. సంజూ శాంసన్ ని పట్టించుకోవడం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘సంజూ శాంసన్ స్థానంలో నేను ఉంటే.. కచ్ఛితంగా చాలా నిరుత్సాహపడేవాడిని.. వన్డేల్లో బాగా ఆడుతున్నా కూడా అతన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.