Rudramkota Pre Release Press Meet: సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ కీలక పాత్రలో నటిస్తున్న `రుద్రంకోట`సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో అనీల్, విభీష, అలేఖ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘రుద్రం కోట నిర్మిస్తున్నా అని జయలలిత చెప్పారు అయితే ఏది హిట్ అయితే అది పెద్ద సినిమా, ఇందులో పాటలు బాగున్నాయి, ట్రైలర్ బాగుందని అన్నారు. అనిల్ బాగా చేశాడు, హీరోయిన్లు బాగా చేశారని అన్నారు. రాము గారు ఎన్నో సీరియల్స్ చేసిన అనుభవం ఉంది. సెప్టెంబర్ 22న రాబోతోన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.
Chandramukhi 2: చంద్రముఖి ఆగమనానికి రంగం సిద్ధం.. 24న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
రాశీ మాట్లాడుతూ ‘నిర్మాతగా అనిల్ నాకు తెలుసు, కానీ ఆయనలో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నాడని తెలియదు. మా జయమ్మ ఇందులో అద్భుతంగా నటించారు, ఇప్పుడు చిన్నా,పెద్ద సినిమాలు అనేవి లేవు ఆడియెన్స్‌కు నచ్చితే అన్నీ పెద్ద చిత్రాలే అని అన్నారు. ఇక సీనియర్ నటి జయలలిత మాట్లాడుతూ.. ‘ఇంత మంది వచ్చి మా సినిమాను సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని, అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. సెప్టెంబర్ 22న ఈ చిత్రం రాబోతోంది, ప్రేక్షక దేవుళ్లు మా సినిమా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా శివ శంకర్ మాస్టర్‌గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, ఎందుకంటే ఆయన మా కోసం రెండు పాటలకు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు అని అన్నారు.