క్రికెట్లో టీమిండియా ఎక్కడ ఆడినా ఆదరణ లభిస్తుంది. మరి ముఖ్యంగా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అవును ఆసియాకప్ లో ఇరుజట్లు 2 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరింత రసవత్తరంగా సాగుతుంది.పైగా ఆసియాలోనే ఇవి రెండు బలమైన జట్లు. అందుకే రెండు లేదా 3 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది.
నిజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇటు చూసే మ్యాచ్ ఇది. ఎప్పుడు ఈ దాయాది పోరు జరిగినా,నరాలు తెగే ఉత్కంఠ లాస్ట్ బాల్ వరకు ఉంటుంది. ఇప్పుడు అలాంటి మరో టోర్నీ రాబోతుంది. అవును ఆసియా కప్ 2025 ని సెప్టెంబర్ లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికి సోనీ టీవీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.ఇక జులై మొదటి వారంలో షెడ్యూల్ ను రిలీజ్ చేసే అవకాశం వుంది.ఇదిలా ఉండగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇక ఈ జట్లు తలపడే ఛాన్సులు మూసుకుపోయినట్టే అని భావించారు. ఎందుకంటే బీసీసీఐ కూడా ఐసీసీకి ఒక లేఖ రాసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 జట్లను ఒకే గ్రూపులో పెట్టవద్దని.. మరి ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ లీగ్ నిర్వహిస్తోంది కాబట్టి రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందా అనే అనుమానాలు వున్నాయి.అంతేకాదు కొద్దీ రోజుల క్రితం ఇండియా ఆసియా కప్ నుండి తప్పుకోనున్నట్లు వార్తలొచ్చాయి.
Perni Nani: వల్లభనేని వంశీ అరెస్ట్ సునకానంద చర్య.. పేర్ని నాని ఫైర్..
మరి ఇప్పుడు డేట్స్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. పైగా ఈ ఆతిధ్య హక్కులు కూడా మన దగ్గరే వున్నాయి కాబట్టి మనవాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చినీయాంశంగా మారింది.ఇప్పుడు సెప్టెంబర్ 7న దుబాయ్ వేదికగా ఈ దాయాది పోరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉగ్రదాడి తర్వాత జరిగే మొదటి మ్యాచ్ కావడంతో హైప్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందువరకు ఈ దాయాధి పోరు తటస్థ వేదికలో జరిగేలా ప్లాన్ చేసారు. అందుకే మన మ్యాచులన్నీ దుబాయ్ లో జరిగాయి.మరి ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఆశలు సన్నగిల్లాయి. కానీ ఇప్పుడొస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ లాక్ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిగురించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏం చెపుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఆసియా కప్ నిర్వహిస్తే మళ్ళీ ఈ మ్యాచ్ 3వ వేదికలో ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ టోర్నీ టి20 ఫార్మాట్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ టీ20 World Cup వుంది కాబట్టి… అయితే ఆ వరల్డ్ కప్ నిర్వహించే హక్కులు కూడా మన దగ్గరే వున్నాయి. మరి దీనిపై మనవాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.