టొమాటోలని విటమిన్ సీ చర్మంలో కొల్లాజెన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే విటమిన్ B6 దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేసి, ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది.

టొమాటోలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మం బయటకు ఒక పొరను ఏర్పరిస్తే, అది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

కొద్దిగా మజ్జిగ, టొమాటో జ్యూస్ కలిపి.. మిశ్రమం చేసుకోవాలి. అందులో కాటన్ బాల్‌ ముంచి, ముఖానికి అప్లై చేయాలి. కాసేపయ్యాక ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తే పొడి చర్మం నుంచి ఉపశమనం లభిస్తుంది.

టొమాటో రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి.. మెడ, ముఖానికి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా చేస్తే, చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి.

టొమాటోని పేస్ట్‌లా చేసి, దానికి కొంత పెరుగు, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ మెడ, ముఖానికి అప్లై చేసి, కాసేపయ్యాక కడగాలి. ఇలా చేస్తే, డల్ స్కిన్‌లో జీవం తిరిగొస్తుంది.

టొమాటోను రెండు ముక్కలుగా కట్ చేసి, వాటిపై చక్కెర పోసి.. ఆ ముక్కల్ని ముఖాన్ని రుద్దాలి. అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే, బ్లాక్ హెడ్స్ నుంచి విముక్తి కలుగుతుంది.

టొమాటో గుజ్జులో దోసకాయ రసం కలిపి.. మెడ, ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. జిడ్డు చర్మం నుంచి ఉపశమనం పొందవచ్చు.

టొమాటో రసంలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి.. ముఖం, మెడ భాగంలో ఈ మిశ్రమంతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల.. ముఖంపై ముడతలు తొలగిపోతాయి.