ఐపీఎల్ 2022 లో రాబోతున్న రెండు కొత్త జట్లలో లక్నో ఫ్రాంచైజీ ఒకటి అనే విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త జట్టు మాజీ ఇంగ్లండ్ ప్రధాన కోచ్, జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ ను తమ హెడ్ కోచ్ గా ప్రకటించింది. అయితే తన సమయంలో అత్యుత్తమ ఆటగాడిగా ఉన్న ఆండీ ఫ్లవర్ 2020 మరియు 2021 ఐపీఎల్ సీజన్ లలో పంజాబ్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు.
అయితే ఇప్పడు ఈ కొత్త జట్టుకు హెడ్ కోచ్ గా నియమించబడటం పై అతను స్పందిస్తూ… కొత్త లక్నో ఫ్రాంచైజీలో చేరినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. అలాగే ఈ అవకాశం నాకు ఇచ్చిన లక్నో ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు. ఇండియాలో క్రికెట్ పట్ల ఉన్న ఆదరణ అసమానమైనది అని ఫ్లవర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ;;ఒక ఆటగాడిగా మరియు కోచ్‌గా, ఆండీ క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. కాబట్టి అతను మా జట్టు విలువను పెంచుతాడని ఆశిస్తున్నాము” అని లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా అన్నారు.