టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో దూకుడే విజయానికి కీలకం. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తక్కువ బంతుల్లో భారీ స్కోర్లు చేయడం జట్టుకు భారీ ఆధిక్యంను ఇస్తుంది. ఈ నేపథ్యంలో 25 బంతుల్లోపు అర్ధ శతకం సాధించిన సందర్భాల్లో కొన్ని స్టార్ ఆటగాళ్లు ప్రత్యేకమైన రికార్డులతో ముందంజలో ఉన్నారు. ఈ జాబితాలో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్ర స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు అభిషేక్ 9 సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేచాడు. దూకుడైన బ్యాటింగ్ శైలి, పవర్‌ప్లేలో బౌలర్లపై ఆధిపత్యం సాధించడమే ఈ జాబితాలో అభిషేక్ అగ్రస్థానానికి చేరడానికి కారణం.
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 9 సార్లు ఈ ఘనతను సాధించాడు. 360 డిగ్రీల బ్యాటింగ్‌కు కేరాఫ్ అయిన సూర్య.. ఏ పరిస్థితిలోనైనా వేగంగా పరుగులు రాబట్టగల సామర్థ్యంతో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఫిల్ సాల్ట్ 7 సార్లు 25 బంతుల్లోపు అర్ధ శతకం నమోదు చేశాడు. టాప్‌లో ఆడుతూ తొలి నుంచే బౌలర్లపై దాడి చేయడం సాల్ట్ ప్రత్యేకత. వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఎవిన్ లూయిస్ కూడా 7 సార్లు ఈ ఘనత సాధించాడు.
Also Read: APSRTC: మరోసారి అద్దె బస్సుల యజమానులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సమావేశం!
మొత్తంగా చూస్తే టీ20 క్రికెట్‌లో వేగవంతమైన అర్ధశతకాలు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి భారత ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌ను శాసించడం భారత అభిమానులకు గర్వకారణంగా మారింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ (68 నాటౌట్; 20 బంతుల్లో 7×4, 5×6), సూర్యకుమార్ (57 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 3×6) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇద్దరు చెలరేగడంతో భారత్ కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 153 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.