ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/23), అక్షర్ పటేల్ (2/22) దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు.…