Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikanth Odela: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే టాలీవుడ్లో గంభీరమైన వ్యక్తిత్వం, కఠినమైన క్రమశిక్షణే గుర్తొస్తాయి. ఆయన సెట్లోకి వస్తున్నారంటే దర్శకుల నుంచి సాధారణ సిబ్బంది దాకా ఒకింత భయంతో కూడిన జాగ్రత్త పాటిస్తుంటారు. అయితే ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవంపై యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పంచుకున్న ముచ్చట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. “మోహన్ బాబు గారు హిట్లర్ లాంటి వారని భయపెట్టారు.. కానీ తీరా సెట్లో చూస్తే చిన్న పిల్లోడిలా కనిపించి షాకిచ్చారు” అంటూ శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికపై మోహన్ బాబుతో తన మొదటి అనుభవాన్ని శ్రీకాంత్ వివరిస్తూ.. “నేను మోహన్ బాబు గారిని కలవడానికి వెళ్లే ముందు ఇండస్ట్రీలో చాలామంది నన్ను హెచ్చరించారు. ఆయన హిట్లర్ లాంటి వారు, ఎవరి మాటా వినరు, నువ్వు చెప్పింది అస్సలు చేయరు, ఆయనతో మాట్లాడటం చాలా కష్టం అని భయపెట్టారు. కానీ తిరుపతిలో తొలిసారి ఆయనను కలిసిన క్షణంలోనే ఆ భావనలన్నీ పటాపంచలయ్యాయి. నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఏ దర్శకుడూ మాట్లాడలేనంత చనువుతో నేను అనుకున్నది అనుకున్నట్లు ఆయనతో నేరుగా చెప్పగలిగాను” అని పేర్కొన్నారు. బయట ఉన్న ప్రచారానికి, సెట్లో మోహన్ బాబు ప్రవర్తనకు అసలు సంబంధమే లేదని అన్నారు.
Also Read
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
- Srikanth Odela: "అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!"
- The Paradise: 'పెద్ది' రిజల్ట్ చూశాక కూడా 'ది పారడైజ్' పాఠాలు నేర్వలేదా?
- Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
“సెట్లో ఆయన ఒక ఎల్కేజీ పిల్లాడి మైండ్‌సెట్‌తో ఉంటారు. మేమే ఇంకా కుర్రాళ్లం అనుకుంటే, మాకంటే చిన్న పిల్లోడిలా సరదాగా కలిసిపోతారు. ఆయన ఎనర్జీని చూసి మా డైరెక్షన్ టీమ్ మొత్తం ఆశ్చర్యపోయేవాళ్లం. సాధారణంగా ప్రతి టెక్నీషియన్‌కు అవార్డులు రావాలని ఉంటుంది. కానీ ‘ది ప్యారడైజ్’కు ఎలాంటి రిజల్ట్ వచ్చినా, మోహన్ బాబు గారితో కలిసి పనిచేయడం నా జీవితంలో దక్కిన అతిపెద్ద లైఫ్‌టైమ్ అచీవ్మెంట్. ఆయన నుంచి ప్లానింగ్, పనితీరు విషయంలో ఎన్నో అమూల్యమైన విషయాలు నేర్చుకున్నాను” అని శ్రీకాంత్ భావోద్వేగంగా వెల్లడించారు. హీరోయిన్ కయాదు లోహర్ పోషించిన పాత్రను మొదట చాలామంది టాప్ హీరోయిన్లు రిజెక్ట్ చేశారని, బోల్డ్ క్యారెక్టర్ కావడంతో స్కిన్ షో ఎక్కువ ఉంటుందేమోనని కయాదు కూడా తొలుత సందేహించిందని, కానీ కథకు తగిన హుందాతనంతోనే తెరకెక్కించామని స్పష్టం చేశారు. అలాగే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు ‘బిర్యానీ’ పాత్ర ఇవ్వడంపై టీమ్‌లో అనుమానాలు ఉన్నా, తన నమ్మకాన్ని నిజం చేస్తూ సంపూ అద్భుతంగా నటించారని కొనియాడారు. హీరో నానితో ఎన్ని క్రియేటివ్ విభేదాలు వచ్చినా ఆయన నన్ను భరించాల్సిందేనని, తమ బంధం సినిమాలకు అతీతమైనదని చెప్పిన శ్రీకాంత్ ఓదెల.. మోహన్ బాబు వంటి సీనియర్ లెజెండ్‌పై చేసిన ఈ రా అండ్ జెన్యూన్ కామెంట్స్ ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజావార్తలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?