Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
- ఏడాది రెండు సార్లు లేఆఫ్ ఎదుర్కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి..
- సాఫ్ట్వేర్ నుంచి వేరే ఫీల్డ్ లోకి మారాలనే ఆలోచన..
- వైరల్‌గా మారిన ఉద్యోగి ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగ ప్రవేశంతో ఐటీ టెక్ పరిశ్రమల్లోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐలపై అన్ని కంపెనీలు కూడా భారీ పెట్టుబడుల్ని పెడుతున్నాయి. ఈ క్రమంలో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల్ని లేఆఫ్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేశాయి.
ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఉద్యోగి ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం నుంచి తీసేశారని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. పాత ఉద్యోగం నుంచి తీసేసిన తర్వాత, కొత్త ఉద్యోగంలో చేరిన రెండున్నర నెలలకే మరోసారి లేఆఫ్ ఎదుర్కొన్నట్లు సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెప్పారు. ఒకే ఏడాదిలో రెండుసార్లు లేఆఫ్ ఎదుర్కోవడంతో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొనసాగించాలా? లేక మరో ఫీల్డ్‌కు మారాలా? అనే సందిగ్ధంలో ఉన్నట్లు చెప్పారు. 30 ఏళ్ల వయసుకు దగ్గరగా ఉణ్న ఆయ ఇంజనీర్ గతేడాది చివర్లో ఉద్యోగాన్ని కోల్పోయాడు, ఆరు నెలల తర్వాత మళ్లీ ఓ కొత్త కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఇలా చేరిన రెండున్నర నెలలకే మళ్లీ ఉద్యోగాన్ని కోల్పోయాడు.
Also Read
- SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
- Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
- ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
‘‘కొత్త కంపెనీలో చేరి నా పని చేసుకుంటున్నా, కానీ రెండున్నర నెలలు పూర్తికాకముందే కంపెనీ మరోసారి నన్ను తొలగించింది’’ అని రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి పనితీరు కారణం కాదని, కేవలం సంస్థాగత ఖర్చులు తగ్గించుకోవడం, రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా తొలగించినట్లు కంపెనీ చెప్పిందని వెల్లడించారు. రెండోసారి ఉద్యోగం కోల్పోవడం తనపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్లు వెల్లడించారు.
సాఫ్ట్వేర్ రంగంలోనే ఉండాలా..?
ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం కోల్పోవడంతో సాఫ్ట్వేర్ రంగంలోనే ఉండాలా? అని సదరు ఉద్యోగి అడుగుతున్నాడు. తన కుటుంబం రిచ్ కాదని, ఎక్కువ కాలం ఉద్యోగం లేకుండా ఉండే పరిస్థితి లేదని చెప్పాడు. కెరీర్ మార్చుకోవాలనుకున్నా ఆర్థిక ఒత్తిడి అడ్డింకిగా మారిందని వివరించాడు. ఉద్యోగం కోసం స్వస్థలం విడిచి, అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.
ఏఐ సాఫ్ట్వేర్ రంగంలో భయాలు..
లేఆఫ్స్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణమని ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. ఏఐ ప్రతీ డెవలపర్ ఉద్యోగాన్ని వెంటనే భర్తీ చేయనప్పటికీ, కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం, ఏఐ ఆధారంగా ప్రొడక్టివిటీ పెంచే ప్రయత్నాలు చేయడం వల్ల భవిష్యత్ అనిశ్చితంగా కనిపిస్తోందని చెప్పాడు. దీంతో సాఫ్ట్వేర్ వదిలి, ఉద్యోగ భద్రత ఉన్న రంగంలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పాడు. కెరీర్ ఎలా నిర్మించుకోవాలో, ఏ ఫీల్డ్ లోకి వెళ్లాలో సలహాలు ఇవ్వాలని తోటి ఉద్యోగుల్ని కోరారు.
తాజావార్తలు
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?