ప్రేమ ఒక మాయ. మనిషి తన జీవితంలో ఏ దశలోనైనా ఈ అనుభూతిని తప్పకుండా పొందేఉంటాడు. అది కొందరికి అమృతాన్ని ఇస్తే మరికొందరికి దుఃఖాన్ని మిగుల్చుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమ నిప్పులాంటిది. తేడా వస్తే, అది మిమ్మల్ని .. మీవాళ్లను సైతం దహనం చేస్తుంది. అందుకే మనసుతో ఆడుకోవడం నిప్పుతో ఆడుకున్నంత ప్రమాదకరం. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన కళ్లకు అన్నీ అందంగానే కనిపిస్తాయి.