Makutam Review: మకుటం రివ్యూ: దర్శకుడిగా విశాల్ మెప్పించాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 1.75 / 5
- MAIN CAST: Vishal, Dushara Vijayan, Anjali and others
- DIRECTOR: Vishal
- MUSIC: GV PRakash
- PRODUCER: Super Good Films
యాక్షన్ హీరోగా తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. హీరోగా రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న ఆయన, ఇప్పుడు తొలిసారిగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘మకుటం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో 99వ మైలురాయి చిత్రంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దర్శకుడిగా విశాల్ మొదటి ప్రయత్నంలోనే బాక్సాఫీస్ వద్ద ‘మకుటం’ దక్కించుకున్నాడా? లేక నిరాశపరిచాడా? రివ్యూలో చూద్దాం.
మకుటం కథ
కృప (విశాల్) నెలకు ₹25,000 జీతంతో నెట్టుకొచ్చే ఒక సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య (దుషారా విజయన్), ఇద్దరు పిల్లలతో కలిసి చాలీచాలని సంపాదనతో కాలం గడుపుతుంటాడు. పెళ్లికి ముందు మామగారితో తనకు కారు ఉందని అబద్ధం చెప్పిన కృప, ఎలాగోలా ఒక పాత బీఎండబ్ల్యూ (BMW) కారు కొని కుటుంబంతో కలిసి సరదాగా ఊటీ ట్రిప్‌కు వెళ్తాడు. అయితే అక్కడ అనూహ్యంగా కృపపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చంపడానికి ప్రయత్నిస్తారు. అసలు ఒక సామాన్య మెడికల్ రిప్రజెంటేటివ్‌పై అంతటి దాడి జరగడానికి గల కారణమేంటి? గతంలో ఉన్న లింగా (విశాల్) ఎవరు? అన్నపూర్ణ (అంజలి) పాత్రతో కృపకు ఉన్న సంబంధం ఏమిటి? శత్రువుల నుంచి తన కుటుంబాన్ని కృప ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా కథ.
Also Read
విశ్లేషణ
కథాపరంగా చూస్తే ‘మకుటం’ తెలుగులో వచ్చిన ఎన్నో పాత రివెంజ్, ఫ్యాక్షన్ ఫార్ములా కథలను గుర్తుచేస్తుంది. శత్రువుల నుంచి కొడుకును రక్షించడానికి ఊరు దాటించి సాధారణ వ్యక్తిగా పెంచడం, ఆ తర్వాత ఊహించని రీతిలో గతం బయటపడటం అనేది మనం దశాబ్దాలుగా చూస్తున్న రొటీన్ పాయింట్. కమర్షియల్ ఎలివేషన్లకు మంచి స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడిగా విశాల్ రాసుకున్న స్క్రీన్‌ప్లే, దర్శకత్వ తీరు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సినిమా ఆరంభంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సీన్స్ నుంచి మొదలుకొని చాలా సన్నివేశాలు బోరింగ్‌గా సాగుతాయి. ఎక్కడా ఒక్క ఆసక్తికరమైన మలుపు గానీ, కొత్తదనం గానీ కనిపించదు. విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉండటంతో పాటు, రొటీన్ డ్రామా ప్రేక్షకుడి సహనానికి తీవ్ర పరీక్ష పెడుతుంది. రొటీన్ కథతో వచ్చిన ‘మకుటం’, కథనంలోనూ, టేకింగ్‌లోనూ ఎలాంటి కొత్తదనం చూపించలేక పూర్తిగా నిరాశపరిచింది. హీరోగా, డైరెక్టర్‌గా విశాల్ కెరీర్‌కు ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడదు.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే విశాల్ ద్విపాత్రాభినయంలో తండ్రి, కొడుకులుగా కనిపించారు. కొడుకు పాత్ర రెగ్యులర్ లుక్‌తో సాగగా, తండ్రి పాత్రలోని ఓల్డ్ ఏజ్ గెటప్ ఆయనకు ఏమాత్రం నప్పలేదు. ఫ్లాష్‌బ్యాక్ లుక్ గతంలో వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’ని గుర్తుచేస్తుంది. నటన పరంగానూ విశాల్ నుంచి ఎలాంటి కొత్తదనం కనిపించదు. ఇక దుషారా విజయన్ & అంజలి కథానాయికలుగా నటించినప్పటికీ వారి పాత్రలకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. జయప్రకాశ్, జాన్ విజయ్, ఝాన్సీ వంటి సీనియర్ నటీనటులు ఉన్నప్పటికీ, చాలామంది పాత్రల్లో మోతాదుకు మించిన లౌడ్ యాక్టింగ్ కనిపిస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఏమాత్రం ఆకట్టుకోలేదు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వచ్చే లౌడ్ సౌండ్స్ ఇబ్బందికరంగా మారాయి. యాక్షన్ సన్నివేశాల్లో కొత్తదనం చూపే ప్రయత్నం చేసినప్పటికీ అవి థియేటర్లలో తీవ్ర అసహనాన్ని, కొన్నిచోట్ల హాస్యాన్ని పుట్టిస్తాయి. పాత పాటలకు విశాల్ డాన్స్ స్టెప్పులు సింక్ కాలేదు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపించినా, సరైన కంటెంట్ లేకపోవడంతో ఆ గ్రాండియర్ వృథాగా మారింది.
ఫైనల్‌గా : మకుటం — పాత చింతకాయ పచ్చడి కథ, జాడీతో సహా
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!