Gedela Raju Review: గేదెల రాజు రివ్యూ
Rating : 2.75 / 5
- MAIN CAST: రఘు కుంచే, రవి చిన్నిబెల్లి, టీనా శ్రావ్య, మోనికా, వికాస్, శ్రీకాంత్ అయ్యంగార్
- DIRECTOR: చైతన్య మోటూరి
- MUSIC: రఘు కుంచే
- PRODUCER: వాణి రవికుమార్ మోటూరి
సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న రఘు కుంచె, నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘గేదెల రాజు’ (కాకినాడ తాలూకా). చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో గేదెల రాజు రివ్యూలో చూద్దాం.
గేదెల రాజు కథ:
కాకినాడ పోర్ట్ సిటీలో ఒక సామాన్యుడిగా మొదలై, తన చుట్టూ ఉన్న స్నేహితులను కూడా తొక్కేసి ఒక మాఫియా డాన్‌లా ఎదుగుతాడు గేదెల రాజు (రఘు కుంచె). రౌడీయిజం, రాజకీయ అండదండలతో ఊరు మొత్తాన్ని గడగడలాడించే రాజుకు స్త్రీ వ్యామోహం ఒక పెద్ద బలహీనత. ఇటు పోర్ట్ వ్యాపారంపై పట్టున్న దుర్గా (శ్రీకాంత్ అయ్యంగార్)తో రాజుకు కార్పొరేటర్ సీటు విషయంలో వైరం మొదలవుతుంది. అయితే అనూహ్యంగా రాజు హత్యకు గురవుతాడు. అప్పటి వరకు కింగ్‌లా బతికిన రాజును చంపింది ఎవరు? అతని ఒకప్పటి స్నేహితులు, తరువాత శత్రువులైన దుర్గ, శివయ్యలా? పోలీసులు చేపట్టిన విచారణలో బయటపడిన సత్యాలు ఏమిటన్నదే మిగిలిన కథ.
Also Read
విశ్లేషణ:
దర్శకుడు చైతన్య మోటూరి ఎంచుకున్న పాయింట్ ఆసక్తికరంగా ఉంది. ఒక బలమైన నెగటివ్ షేడ్ ఉన్న వ్యక్తి చుట్టూ మర్డర్ మిస్టరీని అల్లడం మంచి ప్రయత్నం. సినిమా ప్రారంభంలోనే టైటిల్ రోల్ పాత్రధారి హత్యతో మొదలుపెట్టి, ఫ్లాష్ బ్యాక్ ద్వారా పాత్రలను పరిచయం చేయడం క్యూరియాసిటీని పెంచుతుంది. అయితే దర్శకుడు నాన్ లీనియర్ లో కొంత ప్రయోగం అనుకున్నాడో ఏమో కానీ సినిమాకు అతిపెద్ద మైనస్ స్క్రీన్ ప్లే సహా ఎడిటింగ్ అయిపోయింది. కథ వర్తమానం నుంచి గతం లోకి, గతం నుంచి వర్తమానంలోకి పదే పదే మారుతుండటంతో ప్రేక్షకులు గందరగోళానికి గురవుతారు. చాలా సీన్లకు ఒకదానితో ఒకటి పొంతన లేనట్లు అనిపిస్తుంది. సినిమాలో అనవసరమైన సన్నివేశాలు ఎక్కువవ్వడంతో కథనం చాలా నెమ్మదిగా (స్లో పేస్) సాగుతుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఊహించిన విధంగానే సాగడం నిరాశ పరుస్తుంది.
నటీనటుల ప్రతిభ విషయానికి వస్తే ఈ సినిమాకు రఘు కుంచె ప్రాణం. ఒక మాస్ రౌడీ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో మెప్పించారు. శ్రీకాంత్ అయ్యంగార్ విలక్షణ నటనతో తన పాత్రకు న్యాయం చేశారు. వికాస్ ముప్పాల, టీనా శ్రావ్య, మౌనిక తమ పరిధి మేరకు ఆకట్టుకునే నటనను కనబరిచారు. ముఖ్యంగా రిచ్ పాత్రలో వికాస్ నటన సహజంగా ఉంది.
సాంకేతిక వర్గం పని తీరు విషయానికి వస్తే
రఘు కుంచె అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాలోని ఎలివేషన్ సీన్లకు మంచి బలాన్ని ఇచ్చింది. విజువల్స్ పర్వాలేదనిపించినా, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే సినిమా అవుట్‌పుట్ మరోలా ఉండేది.
తాజావార్తలు
-
Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్‌లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
-
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్‌వెల్.. రెండేళ్ల నిషేధం
-
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!