Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wasim Jaffer: పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజాం, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే వాదనలు నడుస్తూనే ఉంటాయి. తాజాగా పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం ఆటతీరుపై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబర్ నిస్సందేహంగా మంచి ఆటగాడే అయినప్పటికీ, అతడిని విరాట్ కోహ్లీతో పోల్చడం ఏమాత్రం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఈ అనవసర పోలికలే బాబర్ ఫామ్ కోల్పోవడానికి ప్రధాన కారణమని జాఫర్ విశ్లేషించారు. ముఖ్యంగా పాకిస్థాన్ మీడియా, అక్కడి అభిమానులు బాబర్‌ను అవసరానికి మించి ఎక్కువగా హైప్ చేశారని జాఫర్ పేర్కొన్నారు. టీ20 కెరీర్లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు, అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ రెండో అత్యుత్తమ ఆటగాడు. కోహ్లీ అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్దీ, బాబర్ ఫామ్‌లో తగ్గుదల కనిపిస్తోందన్నారు.
“బాబర్ మంచి ఆటగాడు, అందులో సందేహం లేదు. కానీ అతడిని విరాట్ కోహ్లీతో పోల్చడం మొదలుపెట్టి, ‘కింగ్’ అని పిలుస్తూ అతనిపై అనవసర ఒత్తిడిని పెంచారు. ఆ ఒత్తిడి అతడి మనసుపై ప్రభావం చూపింది. విరాట్ కోహ్లీలా ఆడాలని, అతనిలాగే జట్టును నడిపించాలని బాబర్ ప్రయత్నించాడు. కానీ విరాట్ ఈ తరం గొప్ప ఆటగాళ్లలో ఒకడు. విరాట్ ఎప్పటికీ విరాటే. ఈ అతిగా చేసిన ప్రచారమే బాబర్ పతనానికి నాంది పలికింది” అని జాఫర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పంచుకున్న ఓ వీడియోలో తెలిపారు. అంతేకాదు.. బాబర్ ఆజాం కెప్టెన్‌గా రాణించలేకపోయాడని జాఫర్ విమర్శించారు. అనుకున్నంత స్థాయిలో పర్ఫామెన్స్ లేదన్నారు. పాకిస్థాన్ క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం వచ్చినప్పుడు బాబర్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడని అన్నారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరినప్పటికీ, జట్టును నిలకడగా విజయపథంలో నడిపించడంలో, బలమైన జట్టును నిర్మించడంలో బాబర్ విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ప్రస్తుత తరంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన అత్యుత్తమ బ్యాటర్లలో బాబర్ ఒకరని జాఫర్ కొనియాడారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!