Attack Review: ఎటాక్ (హిందీ)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన పేట్రియాటిక్ మూవీస్ కు కొదవలేదు. మరీ ముఖ్యంగా ‘పరమాణు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాలతో జాతీయ వాదుల మనసుల్ని ఈ యాక్షన్ హీరో బాగానే దోచుకున్నాడు. మరోసారి వారందరి మెప్పు పొందేందుకు జాన్ అబ్రహమ్ చేసిన ప్రయత్నమే ‘ఎటాక్ -1’. ఇండియాస్ ఫస్ట్ సూపర్ సోల్జర్ మూవీగా చెప్పబడుతున్న ఈ సినిమా ఏప్రిల్ 1న జనం ముందుకు వచ్చింది.
సోల్జర్ అయిన అర్జున్ షేర్గిల్ టెర్రరిస్ట్ అటాక్ లో తీవ్రంగా గాయాలపాలవుతాడు. బాడీ మొత్తం పేరలైజ్ కావడంతో వీల్ ఛైర్ కే పరిమితం అవుతాడు. అలాంటి వ్యక్తిని డాక్టర్ సాబా (రకుల్ ప్రీత్ సింగ్) ఫ్యూచరిస్టిక్ సైన్స్ టెక్నాలజీతో సూపర్ సోల్జర్ గా మార్చుతుంది. ఆమె చేసిన ప్రయోగానికి అర్జునే పావుగా మారతాడు. పార్లమెంట్ ను కేంద్రంగా చేసుకుని ఈ దేశంపై కెమికల్ దాడికి పాల్పడాలనుకున్న టెర్రిస్టులకు అర్జున్ తన సూపర్ పవర్స్ తో ఎలా బుద్ధి చెప్పాడన్నదే ఈ చిత్ర కథ.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
విశేషం ఏమంటే పేట్రియాటిక్ మూవీ అనగానే మాతృదేశాన్ని ఉద్దేశించి హీరోలు పేజీల కొద్ది సంభాషణలు చెబుతూ ఉంటారు. అలానే టెర్రరిస్టులకు సమయం చిక్కినప్పుడల్లా హితబోధ చేస్తుంటారు. గతంలో జాన్ అబ్రహం చిత్రాలలోనూ ఇలాంటి సన్నివేశాలు బాగానే ఉండేవి. కానీ ఇందులో అలాంటి వాటికి డెబ్యూ డైరెక్టర్ లక్ష్య రాజ్ ఆనంద్ ఆస్కారం ఇవ్వలేదు. దీనినో సైంటిఫిక్, యాక్షన్ థ్రిల్లర్ మూవీగా మలిచాడు. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన సోల్జర్ ను నయా సాంకేతిక పరిజ్ఞానంతో లేచి నిలబడేట్టు చేయడమే కాకుండా అతన్ని సూపర్ సోల్జర్ గా తయారు చేయడం, తిరిగి దేశానికి అతని సేవలను వినియోగించుకోవడం అనే పాయింట్ అందరినీ ఆకట్టుకునేదే. దీనికి నటీనటుల నటనతో పాటు సాంకేతిక నిపుణుల ప్రతిభ కూడా తోడైంది.
జాన్ అబ్రహంకు ఈ తరహా పాత్రలు చేయడం కొట్టిన పిండి. పేరలైజ్డ్ సోల్జర్ గానూ, సూపర్ హీరోను తలపించే సోల్జర్ గానూ జాన్ అబ్రహం మెప్పించాడు. రకుల్ ప్రీతి సింగ్ పోషించిన డాక్టర్ పాత్ర కూడా భిన్నంగా ఉంది. అర్జున్ లవ్ ఇంట్రస్ట్ గా నటించిన జాక్విలిన్ ఫెర్నాండేజ్ తో పోల్చితే రకుల్ ప్రీత్ సింగ్ కు ఇందులో స్క్రీన్ స్పేస్ ఎక్కువ లభించింది. దాన్ని ఆమె చక్కగా యుటిలైజ్ చేసుకుంది. ఇతర ప్రధాన పాత్రలను రత్న పాథక్ షా, రజిత్ కపూర్, ప్రకాశ్ రాజ్ తదితరులు పోషించారు. వారి నుండి చక్కని నటనను దర్శకుడు రాబట్టుకున్నాడు. మూవీ రన్ టైమ్ తక్కువ ఉండటంతో పాటు ఎక్కడా అనవసరమైన లాగ్స్ లేకపోవడం కలిసొచ్చింది. శషావత్ సచిదేవ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ ఎంతవరకూ రియలిస్టిక్ గా ఉందనే విషయాన్ని పక్కన పెడితే, సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ రేసీగా సాగిపోయింది. యాక్షన్ చిత్రాలు, కాస్తంత భిన్నమైన కథాంశాలను ఇష్టపడే వారికి ‘ఎటాక్’ మూవీ నచ్చుతుంది. అయితే మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుని మాత్రం థియేటర్ కు వెళ్ళకూడదు.
రేటింగ్: 2.5/5
ప్లస్ పాయింట్స్
జాన్ అబ్రహం నటన
యాక్షన్ సన్నివేశాలు
ఆసక్తి కలిగించే కథ
మైనెస్ పాయింట్స్
బోర్ కొట్టే ప్రధమార్థం
పండని సెంటిమెంట్ సీన్స్
ట్యాగ్ లైన్: పేట్రియాటిక్ ఎటాక్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!