Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్‌వెల్.. రెండేళ్ల నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doug Bracewell Banned: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ డగ్ బ్రేస్‌వెల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. డ్రగ్ టెస్ట్‌లో విఫలమైన కారణంగా ఆయనపై రెండేళ్ల నిషేధం విధించారు. ఈ నిషేధం 2025 నవంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చి 2027 నవంబర్ 23 వరకు కొనసాగనుంది. అయితే, 2025లో ఇంగ్లాండ్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సందర్భంగా బ్రేస్‌వెల్ నిషేధిత మాదకద్రవ్యం కొకైన్ తీసుకున్నట్లు అంగీకరించాడు. Essex County Cricket Club తరఫున ఆడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చెల్మ్స్‌ఫోర్డ్‌లో Somerset County Cricket Clubతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతను డ్రగ్ వినియోగించినట్లు నివేదికలు వెల్లడించాయి.
Read Also: Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
Also Read
మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత, రెండో రోజు మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు బ్రేస్‌వెల్ కొకైన్ తీసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ మ్యాచ్‌లో పాల్గొని తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీశాడు. ఆ మ్యాచ్‌లో ఎసెక్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఘటనను ఇంగ్లాండ్ క్రికెట్ నియంత్రణ సంస్థ తీవ్రంగా పరిగణించి రెండేళ్ల నిషేధం విధించింది. ఈ నిర్ణయానికి తమ మద్దతు ఉందని ఎసెక్స్ క్లబ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆటగాళ్ల నుంచి అత్యున్నత వృత్తిపరమైన ప్రవర్తనను ఆశిస్తున్నామని, అయితే బ్రేస్‌వెల్ పునరావాసానికి మద్దతు ఇస్తామని క్లబ్ పేర్కొంది.
డగ్ బ్రేస్‌వెల్‌కు ఇది తొలి వివాదం కాదు. గతంలో కూడా పలుమార్లు వివాదాల్లో నిలిచాడు. 2014లో న్యూజిలాండ్ దేశీయ టోర్నమెంట్ Super Smash సందర్భంగా కొకైన్ పరీక్షలో విఫలమై ఒక నెల నిషేధం ఎదుర్కొన్నాడు. 2017లో మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో దోషిగా తేలి 100 గంటల సామాజిక సేవ శిక్షను పొందాడు. అప్పట్లో అతని కారులో మద్యం పరిమాణం అనుమతించిన పరిమితికి మూడింతలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2012లో నేపియర్‌లోని ఓ బార్‌లో జరిగిన గొడవకు సంబంధించి కూడా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నాడు. మైదానంలో ప్రతిభతో గుర్తింపు పొందిన బ్రేస్‌వెల్, మైదానం వెలుపల వివాదాలతోనూ వార్తల్లో నిలిచాడు. తాజా నిషేధం అతని కెరీర్ ముగింపుపై మరో మచ్చగా మారిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!