Dorothy Movie Review: ‘డోరతీ’ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Keerthy Suresh, Sananth, Rishikanth
- DIRECTOR: Karthik Subbaraj
- MUSIC: Ilaiyaraaja
- PRODUCER: Guneet Monga Kapoor, Achin Jain, Jyoti Deshpande
సమాజంలోని రుగ్మతలను, అసమానతలను తనదైన శైలిలో తెరకెక్కించడంలో దర్శకుడు కార్తిక్ సుబ్బరాజుది ప్రత్యేక శైలి. అలాంటి ఆయన దర్శకత్వంలో కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ మూవీ ‘డోరతీ’. విడుదలకు ముందే పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ విడుదల చేసింది. లింగ వివక్ష, పితృస్వామ్య భావజాలం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
డోరతీ కథ
తమిళనాడులోని ఓ పల్లెటూరి వాతావరణంలో సాగే కథ ఇది. సుబ్బు (సనంత్), కార్తీ (రిషికాంత్) ప్రాణ స్నేహితులు. సుబ్బు చిన్నతనంలోనే తల్లి, అక్క చనిపోవడంతో ఆ ఇంట్లో స్త్రీల నీడే ఉండదు. పైగా అతని తండ్రి వీరయ్యకు పరువు, కులం, మగతనం అంటే పిచ్చి. ఆడవాళ్ల ఆనవాలు లేని ఆ ఇంట్లో పెరిగిన సుబ్బు, చిన్నప్పటి నుంచి గొడవలకు పోతూ రఫ్‌గా కనిపిస్తున్నప్పటికీ, తనలోని స్త్రీ స్వభావాన్ని సమాజం గుర్తించకుండా జాగ్రత్తపడతాడు. ఓ దశలో సుబ్బు అన్నయ్య డోరతీ (కీర్తి సురేశ్) అనే కేరళ అమ్మాయిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. ఆమె రాకతో ఇంట్లో కొత్త వెలుగు కనిపిస్తుంది. సుబ్బు ఆమెతో ఎంతో సన్నిహితంగా ఉంటాడు కానీ అనూహ్యంగా డోరతీ అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. పరువు పోతుందన్న భయంతో వీరయ్య దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసు ముగించేస్తాడు. అయితే తన తండ్రి, అన్నయ్యే ఆమెను చంపేశారని సుబ్బు భావిస్తాడు. మరోవైపు సుబ్బు కోసం కార్తీ ఓ హత్య చేయాల్సి వస్తుంది. ఒకపక్క కుటుంబ అకృత్యాలు, మరోపక్క తనలో రగులుతున్న స్త్రీ పురుష కాన్ఫ్లిక్ట్ తట్టుకోలేక తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయాన్ని సుబ్బు బయటపెట్టి ఇల్లు వదిలి పారిపోతాడు. పరువు కోసం కన్న కొడుకుని కూడా చంపాలని చూసే తండ్రి నుంచి సుబ్బు తప్పించుకున్నాడా? అసలు డోరతీ మరణానికి గల కారణమేంటి? ప్రాణ స్నేహితుడు సుబ్బులోని ఈ మార్పును కార్తీ ఎలా స్వీకరించాడు? అనేదే మిగిలిన కథ.
Also Read
విశ్లేషణ
కులం, లింగ వివక్ష, పురుషాధిక్యత వంటి సున్నితమైన అంశాలను ఎంచుకుని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఒక బలమైన సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ లో సుబ్బు, కార్తీల స్నేహం, పల్లెటూరి గొడవలు, డోరతీ ప్రవేశంతో కథ సహజంగా, కాస్త వినోదాత్మకంగా సాగుతుంది. డోరతీ మరణం తర్వాత కథ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వైపు మళ్లుతుందని భావించిన ప్రేక్షకుడికి దర్శకుడు భిన్నమైన ట్విస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో ప్రధానంగా సుబ్బు ట్రాన్స్‌జెండర్‌గా మారిన ప్రయాణం, ఆ వర్గం ఎదుర్కొనే సామాజిక అవమానాలు, సంప్రదాయ ఉత్సవాల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు స్నేహితుల మధ్య సాగే ఎమోషనల్ జర్నీ ఆకట్టుకున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే కొంత గందరగోళానికి గురిచేస్తుంది. కథను అనవసరంగా సాగదీసిన భావన కలుగుతుంది. డోరతీ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని స్పష్టంగా తేల్చకపోవడం ప్రధాన లోపం. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్, స్నేహం తాలూకు భావోద్వేగాలు కొంతవరకు మెప్పిస్తాయి, కానీ ఇప్పటికే ఆ ట్విస్టులు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందరికీ కనెక్ట్ అయ్యే కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే, క్రిటిక్స్ మెచ్చే అంశాలే ఈ సినిమాలో ఎక్కువ.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే సనంత్ సుబ్బు పాత్రలో జీవించేశారు. సాధారణ యువకుడిగా, ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారిన తీరు, హావభావాలు, నడక, నడతల్లో చూపిన పరిపక్వత ప్రశంసనీయం. ద్వితీయార్థంలో ఆయన నటన కథకు ప్రాణంగా నిలిచింది.రిషికాంత్:కార్తీగా రగ్డ్ లుక్‌లో, ఆవేశం నిండిన యువకుడిగా సహజమైన నటన కనబరిచాడు. స్నేహితుడి పట్ల ప్రేమాభిమానాలను చక్కగా పండించాడు. కీర్తి సురేశ్ డోరతీగా స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ సమయమే ఉన్నా, కథను మలుపు తిప్పే కీలక పాత్రలో క్యూట్‌గా, ప్రభావవంతంగా కనిపించారు. ముత్తుకుమార్: క్రూరమైన, పరువు పిచ్చి ఉన్న తండ్రి విజిల్ వీరయ్యగా మెప్పించారు. రామచంద్రన్ దొరైరాజుతో సహా ఇతర సహాయ నటీనటులు తమ పరిధి మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే తిరునావుక్కురసి కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన బలం. 90ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని, నేచురల్ లైటింగ్‌తో ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించారు.ఇళయరాజా అందించిన సంగీతం సన్నివేశాల్లోని లోతైన భావోద్వేగాలను చక్కగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ విభాగంలో ఇంకాస్త కత్తెర పడాల్సింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సాగదీతను ట్రిమ్ చేసి ఉంటే కథనం మరింత వేగంగా ఉండేది. గునీత్ మోంగా, జ్యోతి దేశ్‌పాండే, అచిన్ జైన్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తీసుకున్న పాయింట్ ఎంతో సాహసోపేతమైనదే అయినా, స్క్రీన్‌ప్లేను మరింత పకడ్బందీగా మలిచి ఉంటే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను చేరేది.
‘డోరతీ’ అందరి కప్ ఆఫ్ టీ కాదు
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!