Chennai Love Story Review : చెన్నై లవ్ స్టోరీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Kiran Abbavaram, Gouri Priya, Trigun, Siri Hanmanth and others
- DIRECTOR: Ravi Namburi
- MUSIC: Mani Sharma
- PRODUCER: Sai Razesh, SKN, Dheeraj Mogilineni
కిరణ్ అబ్బవరం హీరోగా, గౌరీ ప్రియ హీరోయిన్గా రూపొందిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘బేబీ’ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాని స్వయంగా సాయి రాజేష్ తన స్నేహితులు ఎస్.కే.ఎన్, ధీరజ్ మొగిలినేనితో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ముందు నుంచి మణిశర్మ అందించిన పాటలు ఈ సినిమాకి మంచి పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మీద ప్రేక్షకులలో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు ఈ సినిమా జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ఓపెన్ చేసింది సినిమా యూనిట్. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
చెన్నై లవ్ స్టోరీ కథ:
ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న తన ప్రియుడు(త్రిగుణ్) పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో నివి (గౌరీ ప్రియ) షాక్‌కి గురవుతుంది. లవ్ బ్రేకప్ అయిన బాధలో ఆమె మద్యానికి బానిస అవుతుంది. అయితే తన స్నేహితులతో కలిసి చెన్నైలో ఉండే ఆమెకు, అనుకోకుండా ఒక రోజు బీచ్‌లో తారసపడతాడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం). దర్శకుడు కావాలని కలలుకనే అతనితో గొడవతోనే మొదలైన పరిచయం, ఆ తర్వాత నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. అయితే దర్శకుడు కావాలని కలలు కంటున్న స్టీవెన్ శంకర్ దర్శకుడు అయ్యాడా లేదా? పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న క్రమంలో వీరిద్దరి పెళ్లి ఎందుకు ఆగింది? చివరికి వీరిద్దరూ ఒకటయ్యారా లేదా? అసలు ఈ చెన్నై లవ్ స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
మణిశర్మ సంగీతం, సాయి రాజేష్ స్టోరీ, కిరణ్ అబ్బవరం హీరో కాంబినేషన్ ప్రేక్షకులలో ఒక ఆసక్తి రేకెత్తించింది. అప్పటికే సాయి రాజేష్ ‘బేబీ’ సినిమాతో హిట్ కొట్టి ఉండటం, మణిశర్మ చాలా కాలం తర్వాత సంగీతం అందిస్తూ ఉండటంతో పాటు, కిరణ్ అబ్బవరం కూడా హిట్ స్ట్రీక్‌లో ఉండటంతో అసలు వీరందరూ కలిసి చేసిన ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకులలో ఏర్పడింది. అయితే సినిమా ప్రారంభం నుంచే సూటిగా సుత్తి లేకుండా కథలోకి తీసుకువెళ్లిపోయాడు దర్శకుడు. ఒక బ్రేకప్, ఆ బ్రేకప్ తర్వాత బాధపడుతున్న హీరోయిన్‌కి హీరో పరిచయం, ఆ తర్వాత వాళ్లిద్దరూ ప్రేమలో పడటం అంటూ చాలా వేగంగా కథ సాగిపోతూ ఉంటుంది. ఇన్‌ఫ్యాక్ట్, ఫస్ట్ ఆఫ్ మంచి ఫీల్ ఇచ్చేలా క్లోజ్ చేశారు. అయితే ఇంటర్వెల్లో వచ్చే షాక్ ఫ్యాక్టర్, సోషల్ మీడియాలో లీక్ అయిపోయి ఉండడం వల్ల పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది. కానీ, ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలు ఏం చేస్తారా అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలైన తరువాత “సినిమాకి లాజిక్ అక్కర్లేదు, అంతా మ్యాజిక్కే” అన్నట్టుగా ఒక మ్యాజిక్‌తో మళ్లీ సినిమాని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు.
అయితే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ సెకండ్ హాఫ్ క్యారీ చేయలేకపోయింది. కన్ఫ్యూజ్ అయ్యారో లేక ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయాలనుకున్నారో తెలియదు కానీ, కథ అక్కడక్కడ తిప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ లవ్ స్టోరీస్ ఇష్టపడే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా కథ రాసుకున్నాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్గానే అనిపించినా, ఎందుకో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇప్పటివరకు మనం చూసిన సినిమాల కంటే కాస్త భిన్నంగా చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది. మొత్తం మీద కిరణ్ అబ్బవరం కాస్త భిన్నమైన స్టోరీలు ఎంచుకుంటూ, ఈ సినిమాతో మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేశాడు.
నటీనటుల విషయానికి వస్తే, కిరణ్ అబ్బవరం స్టీవెన్ శంకర్ అనే పాత్రలో లీనం అయిపోయి నటించాడు. ఈ తరహా పాత్రలు అతనికి కొత్తవి కావు, ఇందులో కూడా జీవించేశాడు. ఇక ఈ సినిమాకి ప్రధానమైన అసెట్ గౌరీ ప్రియ నటన. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె ఆకట్టుకుంది. ఇక త్రిగుణ్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించాడు. గౌరీ ప్రియ స్నేహితురాళ్ల పాత్రలలో నటించిన సిరి హనుమంతు, పూజ, నవీన్ నేని, కార్తీక్ వంటి వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి హీరో కిరణ్ అబ్బవరం అయితే మరో హీరో మణిశర్మ. “మణిశర్మ ఈజ్ బ్యాక్” అనేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు సాంగ్స్ కూడా ఉన్నాయంటే ఆయన ఎంతలా డ్యూటీ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా టోన్ సెట్ చేయడానికి బాగా యూజ్ అయింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్లీ: ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ రైడ్!
తాజావార్తలు
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!