Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన బాల్యాన్ని గడిపిన ఇటలీలోని ఇంటిని మ్యూజియంగా మార్చే ప్రయత్నాలు జరుతున్నాయి. ఇటలీలో నివసిస్తున్న సిక్కు వ్యాపారవేత్త సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్ ఈ ఇంటిని ఆరేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ఇంటిని మ్యూజియంగా మార్చాలని ఆయన భావిస్తున్నారు. సోనియా గాంధీ కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలు, వస్తువులను ఇందులో ప్రదర్శించాలని భావిస్తున్నారు. దీని కోసం గాంధీ కుటుంబాన్ని కలవాలని ఆయన భావిస్తున్నారు. ఈ ఇంటిని ‘‘ ఇండియన్ హౌజ్’’ అని పిలుస్తారని, ఇంటిపై త్రివర్ణ పతాకం ఉంటుందని బయట నేమ్ ప్లేట్‌పై ‘‘సోనియా గాంధీ జన్మస్థలం’’ అని ఉంటుందని ఆయన చెప్పారు.
ఇటలీలోని విసెంజా ప్రావిన్స్‌లోని లుసియానాలో ఈ ఇళ్లు ఉంది. ప్రస్తుతం కాంగ్ నివసిస్తున్న బ్రెసియాకు ఇది కేవలం గంట ప్రయాణ దూరంలోనే ఉంది. సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9న ఈ ఇంట్లోనే జన్మించారని, తన బాల్యంలో తొలి సంవత్సరాలను ఇక్కడే గడిపారని కాంగ్ వివరించారు. పంజాబ్ హోషియార్పూర్ జిల్లాకు చెందిన ఆయన 1992లో ఇటలీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలినాళ్లలో ఇటలీలో ఆయన డెయిరీఫామ్, వ్యవసాయ రంగం, ఫ్యాక్టరీల్లో పనిచేసినట్లు చెప్పారు. 2020లో తన భార్య,కుమార్తెల పేర్ల మీద ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. తాము గాంధీ కుటుంబానికి అభిమానులమని కాంగ్ తెలిపారు. ప్రతీ ఏడాది సోనియా గాంధీ పుట్టనరోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read
- Rahul Gandhi vs Kiren Rijiju: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. 1962 యుద్ధం, పేదరికంపై కాంగ్రెస్‌కు 4 ప్రశ్నలు!
- Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
- Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
- Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
-
Travis Head: ట్రావిస్ హెడ్‌ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
-
Salman Khan-Shraddha Kapoor: శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్.. ఇంతకీ ఏం జరిగింది?
-
Varanasi OTT Deal: ‘వారణాసి’ ఓటీటీ డీల్.. ఊహించని ధర!
-
CM Chandrababu: కూటమి ధర్మం పాటించాం.. సీట్లు రాలేదని అలగడం ఏంటి..? బీజేపీపై చంద్రబాబు అసహనం..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!