మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. నిజానికి ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం సినిమాలు చేసి ఆయా భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ప్రస్తుతానికి ఆయన తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. పవన్ సాదినేని డైరెక్టు చేస్తున్న ఈ సినిమాని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు.…