Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సేవలకు గుర్తింపుగా ఆ జట్టు యాజమాన్యం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ధోని ధరించిన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని రిటైర్ చేస్తున్నట్లు సీఎస్కే ప్రకటించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 19 ఏళ్ల పాటు ధోని ఇదే నంబర్ జెర్సీతో బరిలోకి దిగి అద్భుతమైన విజయాలను అందించారు. ఆయన కెప్టెన్సీలో సీఎస్కే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను కైవసం చేసుకోవడంతో పాటు అత్యధిక సార్లు ప్లేఆఫ్స్, ఫైనల్స్‌కు చేరుకుంది.
ధోని తన పుట్టినరోజు అయిన జూలై 7 (7వ నెల, 1981 సంవత్సరం, 8-1=7) ప్రాతిపదికన ఈ నంబర్‌ను ఎంచుకున్నట్లు గతంలో వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్లో బీసీసీఐ ఇప్పటికే 2020లో ధోని నంబర్ 7 జెర్సీని రిటైర్ చేయగా, తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా అదే బాటలో నడిచింది.
Also Read
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
- AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
- Monkey Repellent Tips : ఇంటిపైకి కోతులు వస్తున్నాయా?.. ఈ చిన్న చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి
ఐపీఎల్ చరిత్రలో ఇలా జెర్సీలను రిటైర్ చేయడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు ముంబై ఇండయన్స్ జట్టు సచిన్ టెండూల్కర్ గౌరవార్థం నంబర్ 10 జెర్సీని రిటైర్ చేసింది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఏబీ డివిలియర్స్ నంబర్ 17, క్రిస్ గేల్ నంబర్ 333 జెర్సీలను పక్కన పెట్టింది. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఆండ్రీ రసెల్ నంబర్ 12 జెర్సీని రిటైర్ చేసింది. ఈ వరుసలో ఇప్పుడు సీఎస్కే కూడా చేరి ధోనిపై తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Food Safety Raids: హైదరాబాద్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా.. 4 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్, 2 సీజ్..
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..