Gold Medal: అంగరంగ వైభవంగా జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 84వ కాన్వొకేషన్ కార్యక్రమానికి ఇస్రో ఛైర్మన్ డా. వి. నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వ విశ్వని ఇన్స్టిట్యూషన్స్ కు చెందిన MSN చిన్ని MBA ఫైనాన్స్‌లో టాపర్‌గా నిలిచి, అత్యున్నత గౌరవం అయిన ప్రొఫెసర్ సముద్రాల సత్యనారాయణ మూర్తి స్మారక బంగారు పతకంను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ డా. వి. నారాయణన్ విద్యా ప్రాముఖ్యతను ప్రశంసించారు. ప్రొఫెసర్ ఎస్. ఎస్. మూర్తి స్మారక బంగారు పతకం ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక బంగారు పతకంను డా. శ్రీదేవసేన, IAS, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, తన తండ్రి అయిన ప్రొఫెసర్ సముద్రాల సత్యనారాయణ మూర్తి జ్ఞాపకార్థం ప్రవేశపెట్టారు. ప్రతీ ఏడాది MBA ఫైనాన్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ఈ బహుమతి ప్రదానం అవుతుంది. ప్రొఫెసర్ మూర్తి అత్యున్నత విద్యావేత్తగా, ఆదర్శ ఉపాధ్యాయుడిగా, నైతిక విలువలకు కట్టుబడి పనిచేసిన వారిగా ఎన్నో తరాలను స్ఫూర్తి పరిచారు.
ఈ సందర్భంగా డా. నారాయణన్ మాట్లాడుతూ.. ఎం.ఎస్. చిన్ని వంటి ప్రతిభావంతులైన విద్యార్థుల విజయాలు మన విద్యా వ్యవస్థ బలాన్ని చాటుతున్నాయి. భారత భవిష్యత్తు ఇలాంటి మేధావుల చేతుల్లో ఉంది. ప్రొఫెసర్ మూర్తి వంటి మహోన్నత ఉపాధ్యాయుల వారసత్వం కొత్త తరాలను నడిపించడం ఎంతో సంతోషకరం అని అన్నారు. ప్రొఫెసర్ మూర్తి స్ఫూర్తితో ఆయన శిష్యులు శ్రీ. శ్రీనివాస్ ఆచార్య, జి.ఎస్.ఎస్.వి. రావు, హైదరాబాద్‌లో విశ్వ విశ్వని ఇన్స్టిట్యూషన్స్ ను స్థాపించారు. తమ గురువు బోధించిన స్ఫూర్తిని ఆధునిక విద్యా వ్యవస్థలో విలీనం చేస్తూ.. శాస్త్రీయ క్రమశిక్షణ, పరిశ్రమ అనుసంధానంతోపాటు నైతిక విలువల సమన్వయంతో ఈ సంస్థను తీర్చిదిద్దారన్నారు.
Asia Cup 2025: 165 స్ట్రైక్‌రేట్ ఉన్నా భారత జట్టులో లేడు.. ఆడడం తప్ప ఇంకేం చేయగలం?
అలాగే సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ ఆచార్య మాట్లాడుతూ.. ఈ బంగారు పతకం మాకు గర్వకారణం. ఇది కేవలం విద్యా ప్రతిభ మాత్రమే కాదు.. మా గురువు ప్రొఫెసర్ మూర్తి విలువలు, వారసత్వానికి ప్రతీక అని అన్నారు. ఎం.ఎస్. చిన్ని విజయం మా కట్టుబాటును మరింత బలపరుస్తుందని ఈ సందర్బంగా ఆయన అన్నారు. మరో సహ వ్యవస్థాపకులు జి.ఎస్.ఎస్.వి. రావు మాట్లాడుతూ.. ప్రొఫెసర్ మూర్తి ఆదర్శాలు విశ్వ విశ్వని పునాది. ఒస్మానియా యూనివర్సిటీ కాన్వొకేషన్‌లో మా విద్యార్థిని బంగారు పతకంతో సత్కరించబడటం మాకు గౌరవం, ప్రేరణ అని అన్నారు.
ఇక అవార్డు గెల్చుకున్న ఎం.ఎస్. చిన్ని మాట్లాడుతూ.. ఈ బంగారు పతకం అందుకోవడం నాకు గొప్ప గౌరవం. ఇది నా కృషికి మాత్రమే కాదు, విశ్వ విశ్వనిలో నాకు అందిన మార్గదర్శకత్వం. అలాగే ప్రోత్సాహానికి గుర్తింపుగా భావిస్తున్నాను. నా విజయాన్ని నా గురువులకు, సంస్థకు అంకితం చేస్తున్నానని అన్నారు. ఈ గౌరవం ఉస్మానియా యూనివర్సిటీ యొక్క శతాబ్దకాల విద్యా ప్రాముఖ్యతను, ప్రొఫెసర్ మూర్తి వారసత్వాన్ని, విశ్వ విశ్వని సంస్థలు భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తోంది.
Suicide Attempt: దారుణం.. ఇద్దరు చిన్నారులను సంపులో పడేసిన తల్లి.. తాను ఆత్మహత్య హత్యాయత్నం!
విశ్వ విశ్వని ఇన్స్టిట్యూషన్స్ గురించి చూసినట్లయితే.. ప్రొఫెసర్ ఎస్. ఎస్. మూర్తి శిష్యులు స్థాపించిన విశ్వ విశ్వని ఇన్స్టిట్యూషన్స్, హైదరాబాద్‌లో నిర్వహణ, సాంకేతిక విద్యతో పాటు అనుబంధ రంగాల్లో నాణ్యమైన ఉన్నత విద్య అందించడంలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. మార్గదర్శకత్వం, నూతన ఆవిష్కరణలు మరియు విద్యా ప్రాముఖ్యతను పునాదులుగా చేసుకొని, విశ్వ విశ్వని గ్లోబల్ దృక్పథం కలిగిన, నైతిక విలువలకు కట్టుబడి ఉన్న నాయకులను తీర్చిదిద్దుతోంది.