Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు
- ఉదయం నుంచే భారీగా దర్శనాలు
- క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు
- సాయంత్రం మరింత పెరగనున్న రద్దీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఖైరతాబాద్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున వేచి ఉన్నారు.
ఉదయం నుంచే 50 వేల మందికి పైగా దర్శనం
సెలవు రోజు కావడంతో ఉదయం నుంచే భక్తుల రాక వేగంగా పెరిగింది. ఇప్పటివరకు సుమారు 50 వేల మందికి పైగా భక్తులు బడా గణపతిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసిన నాలుగు క్యూలైన్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి కాస్త సమయం పడుతున్నా, భక్తులు ఓపికగా లైన్లలో ముందుకు సాగుతున్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
భారీగా పోలీసు భద్రత.. సాయంత్రానికి మరింత రద్దీ
వీకెండ్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు రోప్ పార్టీలను రంగంలోకి దించారు. భక్తులను క్రమపద్ధతిలో ముందుకు పంపుతూ రద్దీని నియంత్రిస్తున్నారు. ఇక సాయంత్రం వేళ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు