TDP : టీడీపీలో పోటీ చేసేదెవరు..? దూరంగా ఉండేదెవరు..? |
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో మూడు కుటుంబాల నుంచి గతంలో ఇద్దరు చొప్పున పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి కుటుంబంలో పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేశారు. కోట్ల కుటుంబంలో కర్నూలు ఎంపీగా సూర్యప్రకాష్‌రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాత బరిలో ఉన్నారు. భూమా ఫ్యామిలీ నుంచి ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఎన్నికల గోదాలోకి దిగారు. ఇప్పుడు ఈ కుటుంబాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు? పోటీకి దూరంగా ఉండేదెవరు అనేది చర్చగా మారింది.
డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించిన తర్వాత ఈ చర్చ మరింత ఊపందుకుంది. కేఈ కుటుంబం నుంచి ప్రభాకర్, శ్యాంబాబులు మరోసారి బరిలో దిగాలని చూస్తున్నారు. వీరిలో ప్రభాకర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. డోన్ లేదా ఆలూరు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నా.. డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించేశారు చంద్రబాబు. ఇక మిగిలింది ఆలూరు. అక్కడ కోట్ల సుజాత కర్చీఫ్ వేశారు. ఏదీ కాకపోతే కర్నూలు ఎంపీగా అయినా బరిలో దిగుతానని చెబుతున్నారట. అయితే అక్కడ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఉన్నారు. దీంతో కేఈ ప్రభాకర్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. పత్తికొండను వీడేది లేదంటున్నారు ప్రభాకర్ అన్న కుమారుడు కేఈ శ్యాంబాబు.
Also Read
- Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్‌లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
కోట్ల కుటుంబంలో టీడీపీ టికెట్లు ఆశిస్తోంది ఇద్దరే. ఒకరు సూర్యప్రకాష్‌రెడ్డి. రెండో వ్యక్తి సుజాతమ్మ. వీరిలో సూర్యప్రకాష్‌రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో చంద్రబాబు ఆయన్ని కాదనే పరిస్థితి లేదంటున్నారు. ఆలూరులో కోట్ల సుజాతకు టీడీపీ నుంచే నలుగురు నేతలు పోటీగా ఉన్నప్పటికీ ఆమె అభ్యర్థిత్వానికే మొగ్గు చూపొచ్చన్నది ఒక వాదన. అయితే చివరి నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు పార్టీ నేతలు.
ఆళ్లగడ్డ విషయంలో భూమా అఖిల ప్రియ కేంద్రంగా ఇటీవల జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక్కడ బీజేపీ నేతగా ఉన్న ఆమె బంధువు భూమా కిశోర్‌రెడ్డి టీడీపీలో చేరతారనే ప్రచారం ఉంది. అదే జరిగితే కిశోర్రెడ్డికే టీడీపీ టికెట్ ఇస్తారని టాక్ నడుస్తోంది. దీనికితోడు అఖిలప్రియ, కిశోర్‌రెడ్డి మధ్య వివాదాలు పొలిటికల్ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ఇక నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి మరోసారి పోటీకి ఆసక్తితోఉన్నప్పటికీ.. అక్కడ ఏవీ సుబ్బారెడ్డి, ఫరూఖ్‌ల నుంచి పోటీ తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఫరూఖ్ గతంలో పోటీ చేశారు. ఏవీ సుబ్బారెడ్డికి ఇక్కడ పట్టుంది. పైగా అఖిలకు, బ్రహ్మానందరెడ్డికి పడటం లేదని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భూమా కుటుంబం నుంచి ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నేది సస్పెన్స్‌గా ఉందట. మరి.. డోన్‌లో క్లారిటీ ఇచ్చినట్టుగానే ఈ కుటుంబాలకు కూడా ముందుగానే చంద్రబాబు స్పష్టత ఇస్తారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!