ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో మూడు కుటుంబాల నుంచి గతంలో ఇద్దరు చొప్పున పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి కుటుంబంలో పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేశారు. కోట్ల కుటుంబంలో కర్నూలు ఎంపీగా సూర్యప్రకాష్‌రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాత బరిలో ఉన్నారు. భూమా ఫ్యామిలీ నుంచి ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఎన్నికల గోదాలోకి దిగారు. ఇప్పుడు ఈ కుటుంబాల నుంచి వచ్చే…