TDP : మాజీ మంత్రులు సుజాత, జవహర్ దారెటు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీతల సుజాత.. కొత్తపల్లి జవహర్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు టీడీపీ నేతలు గతంలో మంత్రులుగా పనిచేశారు. 2014లో చింతలపూడి నుంచి సుజాత, కొవ్వూరు నుంచి జవహర్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరూ స్థానికేతరులైనప్పటికీ.. అక్కడ టీడీపీకి బలం ఉండటంతో అసెంబ్లీలో ఆనాడు ఈజీగానే అడుగు పెట్టేశారు. గత ప్రభుత్వంలో ముందుగా సుజాత.. తర్వాత జవహర్ కేబినెట్ మంత్రులయ్యారు. గెలిచిన కొత్తలో బాగానే ఉన్నా.. మంత్రులయ్యాక నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. తగాదాలను పరిష్కరించకుండా.. ఆధిపత్య ధోరణి ప్రదర్శించడంతో ఇద్దరికీ మొదటికీ మోసం వచ్చిందని ఇప్పటికీ చెబుతారు.
2019 ఎన్నికల నాటికి వర్గపోరు తీవ్రం కావడంతో అది అభ్యర్థుల ఎంపికపైనా ప్రభావం చూపించింది. చివరకు పీతల సుజాతకు చింతలపూడి టికెట్ ఇవ్వలేదు టీడీపీ అధిష్ఠానం. జవహర్‌ను కొవ్వూరు నుంచి తిరువూరుకు పంపింది పార్టీ. ఈ మార్పులు చేసినప్పటికీ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి కలిసి రాలేదు. అప్పటి నుంచి చింతలపూడి, కొవ్వూరుల్లో పార్టీ కేడర్‌ను అంటిపెట్టుకున్న నాయకులే కరువయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి టీడీపీలో ఆశావహుల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ పోయిన చోటే వెతుక్కోవాలని సుజాత, జవహర్ చూస్తున్నారట.
Also Read
చింతలపూడిలో సుజాత, కొవ్వూరులో జవహర్ మరోసారి చురుకుగా పావులు కదుపుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసుకున్న అనుచరులతో మళ్లీ టచ్‌లోకి వెళ్తున్నారట. అసంతృప్త నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట నాయకులు. అవకాశం చిక్కితే తాము కేడర్‌కు అందుబాటులో ఉన్నామనే సంకేతాలను అధినేత దృష్టికి వెళ్లేలా తెగ పాట్లు పడుతున్నారట. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో తమకు ఆర్థికంగా సాయం చేసేవారి వేటలోనూ పడ్డారట మాజీ మంత్రులు. వీరి ఫీట్లు చూశాక.. ఇప్పుడీ పాట్లు ఎందుకు.. అందరితో అప్పుడే సఖ్యతగా ఉంటే పోయేదిగా అని తెలుగు తమ్ముళ్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట.
రెండు నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం టీడీపీ కేడర్ అధిష్ఠానం ఆదేశాల కోసం ఎదురు చూస్తోంది. అయితే చింతలపూడి, కొవ్వూరులు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కావడంతో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. సుజాత, జవహర్‌లు మాత్రం టికెట్ తమకే వస్తుందనే పూర్తి ధీమాతో పర్యటనలు చేస్తున్నారట. కానీ.. మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా కేడర్ గుర్తు చేస్తోంది. కష్టపడ్డవారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని అధినేత కుండబద్దలు కొట్టారు. ఆ లైన్‌ను ఆధారంగా చేసుకునే సుజాత, జవహర్‌లు పట్టుకోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరి.. మాజీ మంత్రుల విషయంలో చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయో? పాత వారికే పిలిచి టికెట్ ఇస్తారో.. కొత్త వారికి పట్టం కడతారో చూడాలి.
తాజావార్తలు
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?